ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చాంపియన్‌ అల్కారజ్‌

ABN, Publish Date - Jun 10 , 2024 | 04:19 AM

వెనుకబడినా.. అద్భుతంగా పుంజుకొన్న స్పెయిన్‌ చిన్నోడు కార్లోస్‌ అల్కారజ్‌ తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడాడు.

తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం

ఫైనల్లో జ్వెరెవ్‌కు నిరాశ

పారిస్‌: వెనుకబడినా.. అద్భుతంగా పుంజుకొన్న స్పెయిన్‌ చిన్నోడు కార్లోస్‌ అల్కారజ్‌ తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్‌ అల్కారజ్‌ 6-3, 2-6, 5-7, 6-1, 6-2తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై పోరాడి గెలిచాడు. 2022లో యూఎస్‌ ఓపెన్‌, 2023లో వింబుల్డన్‌ నెగ్గిన కార్లో్‌సకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఈ క్రమంలో మూడు వేదికల్లో విజేతగా నిలిచిన పిన్న వయస్కుడిగా స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ (22 ఏళ్ల 5 నెలలు) రికార్డును అల్కారజ్‌ (21 ఏళ్లు) అధిగమించాడు. 2004 తర్వాత బిగ్‌-3లో కనీసం ఒక్కరుకూడా లేకుండా జరిగిన ఈ ఫైనల్లో ఇరువురూ హోరాహోరీగా తలపడ్డారు. వరుసగా రెండు సెట్లు నెగ్గిన జ్వెరెవ్‌.. ఆ తర్వాత పట్టుకోల్పోయాడు. దీంతో 2020 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడిన అలెగ్జాండర్‌ మరోసారి రన్నర్‌పగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పట్టువదలని కార్లోస్‌: ఆరంభంలో దూకుడుగా ఆడిన అల్కారజ్‌ తొలి సెట్‌ను సునాయాసంగా సొంతం చేసుకొన్నాడు. ఐదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన అల్కారజ్‌ 6-3తో సెట్‌ను సొంతం చేసుకొన్నాడు. అయితే, రెండో సెట్‌లో పుంజుకొన్న అలెగ్జాండర్‌ ఐదో గేమ్‌లో కార్లోస్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 3-2తో ముందంజ వేశాడు. ఇక్కడి నుంచి వరుసగా గేమ్‌లు నెగ్గి సమం చేశాడు. మూడో సెట్‌లో అల్కారజ్‌ బ్రేక్‌ పాయింట్‌తో 4-2తో ఆధిక్యం సాధించినా.. పట్టువదలని జ్వెరెవ్‌ పోరాడి 5-5తో సమం చేశాడు. మరోసారి ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన అలెగ్జాండర్‌ 7-5తో సెట్‌ను దక్కించుకొన్నాడు. కానీ, నాలుగో సెట్‌లో జూలు విదిల్చిన అల్కారజ్‌ 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే, ఐదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీ్‌సను జ్వెరెవ్‌ బ్రేక్‌ చేసినా.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లు గెల్చిన కార్లోస్‌ సెట్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు. దీంతో మ్యాచ్‌ ఫలితం ఐదో సెట్‌కు దారి తీసింది. నిర్ణాయక సెట్‌లో అల్కారజ్‌ జోరు ముందు జ్వెరెవ్‌ నిలవలేక పోయాడు. మూడోగేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించిన కార్లోస్‌ 2-1తో పైచేయి సాధించాడు. ఆ తర్వాత ఇద్దరూ తమతమ సర్వీ్‌సలను నిలబెట్టుకొన్నారు. కానీ, ఏడో గేమ్‌లో మరోసారి ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన అల్కారజ్‌.. ఆ తర్వాతి గేమ్‌లో గెలిచి చాంపియన్‌షి్‌పను సొంతం చేసుకొన్నాడు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 04:21 AM

Advertising
Advertising