ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దౌత్య సంబంధాల్లో క్రికెట్‌ అంతర్భాగం

ABN, Publish Date - Nov 29 , 2024 | 05:19 AM

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న భారత జట్టు.. ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీ్‌సను మర్యాద పూర్వకంగా కలుసుకుంది. శనివారం నుంచి రెండు రోజులపాటు ఆసీస్‌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ లెవెన్‌తో టీమిండియా పింక్‌ బాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌....

ఆస్ర్టేలియా పార్లమెంట్‌లో రోహిత్‌

ప్రధాని అల్బనీ్‌సతో భారత జట్టు భేటీ

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న భారత జట్టు.. ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీ్‌సను మర్యాద పూర్వకంగా కలుసుకుంది. శనివారం నుంచి రెండు రోజులపాటు ఆసీస్‌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ లెవెన్‌తో టీమిండియా పింక్‌ బాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. దీన్ని పురస్కరించుకొని భారత జట్టుకు అల్బనీస్‌ గురువారం విందు ఏర్పాటు చేశారు. ప్రొటోకాల్‌ ప్రకారం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. భారత జట్టు ఆటగాళ్లను అల్బనీస్‌కు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా పెర్త్‌ టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన బుమ్రా, కోహ్లీ సహా ఇతర ఆటగాళ్లను ఆయన ప్రశంసించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో రోహిత్‌ అతిథిగా ప్రసంగించాడు. ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో క్రికెట్‌ అంతర్భాగమని అన్నాడు. ‘క్రీడలు, వాణిజ్యంలో ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలున్నాయి. ఆటగాళ్ల పోరాటతత్వం, అభిమానుల మద్దతు కారణంగా ఆసీస్‌తో తలపడడం సవాళ్లతో కూడుకున్నది.


అలాంటి టీమ్‌పై పైచేయి సాధించడం సంతోషంగా ఉంద’ని రోహిత్‌ చెప్పాడు. తమను ఆహ్వానించినందుకు అల్బనీ్‌సకు కృతజ్ఞతలు తెలిపాడు. జాక్‌ ఎడ్వర్డ్స్‌ సారథ్యంలోని ప్రైమ్‌ మినిస్టర్స్‌ లెవెన్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. భేటీ ముగిసిన తర్వాత ‘భారత్‌తో ఆడడం ప్రైమ్‌ మినిస్టర్స్‌ లెవన్‌కు పెను సవాలే. కానీ, మా ఆటగాళ్లకే నా మద్దతు అని మోదీకి కూడా చెప్పా’ అని అల్బనీస్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి ‘భారత్‌, ప్రైమ్‌ మినిస్టర్స్‌ లెవెన్‌ జట్లను నా మిత్రుడు కలవడం ఎంతో ఆనందదాయకం. సిరీస్‌ను టీమిండియా అద్భుతంగా ఆరంభించింది. కోట్లాది మంది భారతీయులు తమ జట్టుకు మద్దతుగా ఉన్నారు. రానున్న రోజుల్లో హోరాహోరీ పోరు చూస్తామని ఆశిస్తున్నాన’ని ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. కాగా, నెట్‌ ప్రాక్టీ్‌సకు టీమిండియా ఒక్క రోజు విరామం ప్రకటించింది. శుక్రవారం మళ్లీ సాధన చేయనుంది.


ఎంతోకొంత మసాలా కావాలిగా!

ఆటగాళ్లతో పరిచయం సందర్భంగా అల్బనీస్‌-కోహ్లీ మధ్య సంభాషణ హైలైట్‌గా నిలిచింది. తొలి టెస్ట్‌లో విరాట్‌ శతకంతో ఆకట్టుకున్నాడు. దాని గురించి ప్రస్తావిస్తూ.. ‘పెర్త్‌లో అద్భుత సెంచరీ కొట్టావు. అప్పటికింకా మాజట్టు పెద్దగా కష్టాల్లో పడలేదు’ అని కోహ్లీతో అల్బనీస్‌ అన్నారు. దానికి విరాట్‌ ఏమాత్రం తడుముకోకుండా.. ‘ప్రతిసారీ ఎంతో కొంత మసాలా దట్టిస్తూ ఉండాలి కదా’ అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. వీరి సంభాషణ నెట్‌లో వైరల్‌గా మారింది.

Updated Date - Nov 29 , 2024 | 02:00 PM