ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. శతక్కొట్టేశాడుగా!

ABN, Publish Date - Jul 07 , 2024 | 05:51 PM

జింబాబ్వేపై తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి చెత్త రికార్డ్ నెలకొల్పిన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఊచకోత కోశాడు. మొదటి మ్యాచ్‌లో తనకు ఎదురైన పరాభావానికి తనివితీరా..

Abhishek Sharma

జింబాబ్వేపై (Zimbabwe) తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి చెత్త రికార్డ్ నెలకొల్పిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. రెండో మ్యాచ్‌లో మాత్రం ఊచకోత కోశాడు. మొదటి మ్యాచ్‌లో తనకు ఎదురైన పరాభావానికి తనివితీరా ప్రతీకారం తీర్చుకునేలా విధ్వంసం సృష్టించాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి తన బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెట్టిన అతగాడు.. శతకం కొట్టేదాకా చల్లారలేదు. ఒకటే వీరబాదుడు బాదేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి.. సిక్సులు, ఫోర్లతో మైదానంలో బౌండరీల సునామీ సృష్టించాడు. కేవలం 47 బంతుల్లోనే శతకం చేశాడంటే.. అతడు ఏ రేంజ్‌లో చితక్కొట్టాడో మీరే అర్థం చేసుకోండి.


కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో (Shubman Gill) కలిసి ఓపెనింగ్ చేసిన అభిషేక్.. తొలి బంతికే సిక్స్ బాదాడు. ఆ తర్వాత గిల్ ఔట్ అవ్వడంతో కాస్త నెమ్మదించాడు. క్రీజులో కుదురుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నాడు. ఇక ఎప్పుడైతే మైదానంలో సెటిల్ అయ్యాడో.. ఇక అప్పటి నుంచి తన ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని దుమ్ముదులిపేశాడు. ఓవైపు రుతురాజ్ నిదానంగా ఇన్నింగ్స్ ఆడితే.. మరోవైపు అభిషేక్ పూనకం వచ్చినట్లు దుమ్ముదులిపేశాడు. ఆకలితో ఉన్న పులి వేటాడితే ఎలా ఉంటుందో.. ఆ రేంజ్‌లో అతను పరుగుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే.. అంతర్జాతీయ టీ20Iలో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు.


ఇదే సమయంలో అభిషేక్ తన పేరిట ఒక సంచలన రికార్డ్ లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రెండో మ్యాచ్‌కే శతకం చేసిన భారత క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. అయితే.. శతకం చేశాక అదే దూకుడు కొనసాగించాలని అభిషేక్ భావించి, భారీ షాట్ కొట్టబోయాడు. కానీ.. దురదృష్టవశాత్తూ అది నేరుగా ఫీల్డర్ చేతిలో పోయింది. దీంతో.. అభిషేక్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అతని పుణ్యమా అని.. జింబాబ్వేపై రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరుని నమోదు చేయగలిగింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 06:21 PM

Advertising
Advertising
<