IND vs AUS: భయపెడుతున్న ఆడిలైడ్ పిచ్ హిస్టరీ.. ఎవ్వరికైనా అదే రిజల్టా..
ABN, Publish Date - Dec 05 , 2024 | 03:06 PM
టీమిండియా, కంగారూల మధ్య జరగనున్న పింక్ బాల్ టెస్టులో ఆడిలైడ్ ఓవల్ పిచ్ కీలక పాత్ర పోషించనుంది. అయితే, ఇదే పిచ్ పై గతంలో టీమిండియా చెత్త ప్రదర్శన కలవరపెడుతోంది..
శుక్రవారం నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమయ్యే డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో పిచ్‌పై ఆడిలైడ్ ఓవల్ చీఫ్ క్యూరేటర్ డామియన్ హోగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు కలిసొస్తుందని.. ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కున్నా ఆ తర్వాత మెల్లిగా ఆటగాళ్లు ఊపందుకుంటారన్నాడు. పిచ్ పై ఉండే తేలికపాటి గ్రాస్ తొలిరోజు ఫాస్ట్ బౌలర్లకు సహాయం చేస్తుంది. కానీ, సమయం గడుస్తున్నకొద్దీ స్పిన్నర్లకు కూడా సహకరిస్తుందన్నాడు. కానీ, ఈ పిచ్ పై భారత్ పాత రికార్డులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
చరిత్ర చూసుకున్నా అదే రుజువైంది..
హోగ్ బుధవారం మాట్లాడుతూ, 'పిచ్‌పై ఆరు మిల్లీమీటర్ల గడ్డి ఉంటుంది. బంతి త్వరగా రంగు వదలకుండా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేశాం. గ్రాస్ ఉండటం వల్ల ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహాయం చేస్తుంది. అయితే మ్యాచ్ సమయం గడుస్తున్నకొద్దీ స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. చరిత్ర చూసుకుంటే.. అడిలైడ్‌లో స్పిన్ ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు నిపుణులైన స్పిన్నర్‌ను ఎంచుకోవాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. అడిలైడ్‌లో ఫ్లడ్‌లైట్‌ల వెలుతురు మధ్య బ్యాటింగ్ చేయడం కష్టం. స్పిన్ పాత్ర పోషిస్తుంది కాబట్టి గడ్డి కారణంగా బంతి వేగంగా బయటకు వస్తుంది. సాధారణంగానే ఇది మంచి బౌన్స్‌ను కలుగజేస్తుంది. సాధారణంగా ఇక్కడ మ్యాచ్ ఆసాంతం పేసర్లకు సహకారం లభిస్తుంది. రాత్రి సెషన్లలో స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. బ్యాట్‌కు బంతికి మధ్య సమతూకం ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని హో అన్నాడు. బంతి పాతదయ్యే కొద్దీ, బ్యాట్స్‌మెన్ దానిని సద్వినియోగం చేసుకోగలరని, భాగస్వామ్యం ఉంటే అది మరింత మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాము అని హోగ్ అన్నాడు.
మరోవైపు ఇదే వేదికపై భారత కు చివరిసారి ఎదురైన చేదు అనుభవం టీమిండియా ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. 36 పరుగుల దారుణ ఓటమిని చవిచూశారు. ఈ సారి తొలి టెస్టులో బలమైన రికార్డును కలిగి ఉన్నప్పటికీ పింక్ బాల్ క్రికెట్లో ఆడిలైడ్ ఓవల్ ఓ కంచుకోటగా మిగిలిపోయింది. ఇక్కడ హైస్టేక్స్ కారణంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. రేపటి వాతావరణం అనుకూలించి వర్షం రాకుండా ఉంటే ఈ రెండు జట్ల మధ్య రసవత్తరమైన పోరును అభిమానులు ఎంజాయ్ చేయొచ్చు.
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైమ్ రికార్డ్
Updated Date - Dec 05 , 2024 | 04:24 PM