ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup: బాబర్‌తో పాటు ఆ నలుగురిని పాక్ జట్టు నుంచి తొలగించాలి

ABN, Publish Date - Jun 16 , 2024 | 08:57 AM

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే పాకిస్తాన్ జట్టు నిష్ర్కమించడంతో.. ఆ దేశ మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు తారాస్థాయిలో విమర్శలు..

Ahmed Shehzad Demands To Remove Babar Azam From Team

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) గ్రూప్ దశలోనే పాకిస్తాన్ (Pakistan) జట్టు నిష్ర్కమించడంతో.. ఆ దేశ మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు తారాస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్‌గా బాబర్ ఆజంని తొలగించాలని, సరైన ప్రదర్శన కనబర్చని ఇతర ఆటగాళ్లను సైతం పక్కన పెట్టేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో పాక్ మాజీ ప్లేయర్ అహ్మద్ షెహజాద్ (Ahmed Shehzad) చేరిపోయాడు. బాబర్ ఆజంపై (Babar Azam) మొదటి నుంచే విమర్శనాస్త్రాలు సంధిస్తున్న అహ్మద్.. ఇప్పుడు అతనితో పాటు మరో నలుగురు ఆటగాళ్లని జట్టు నుంచి తొలగించాల్సిందిగా డిమాండ్ చేశాడు.


‘‘గత నాలుగైదు సంవత్సరాల నుంచి బాబర్ ఆజం, షాహీన్ షా ఆఫ్రీది, మహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జమన్, హరిస్ రవుఫ్ పాక్ జట్టులో కొనసాగుతున్నారు. ఆ ఐదుగురికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ.. కీలకమైన సమయాల్లో జట్టుని గెలిపించడంలో వారంతా విఫలమయ్యారు. జట్టులో నాయకత్వ లోపం ఉంది. ఓడిన ప్రతిసారి తమ తప్పుల నుంచి నేర్చుకుంటామని వాళ్లు చెప్తూనే ఉన్నారు. ఇంకేం నేర్చుకుంటారు?’’ అంటూ అహ్మద్ విరుచుకుపడ్డాడు. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో రన్‌రేట్‌ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు.. రిజ్వాన్ చాలా నెమ్మదిగా అర్థశతకం చేశాడని తూర్పారపట్టారు. ఇక బాబర్ ఆజం రన్-ఏ-బాల్ చేశాడని, ఆ పిచ్‌లో దెయ్యాలేమీ లేవని మండిపడ్డాడు.


‘‘అసలు సమస్య ఏమిటంటే.. జట్టులోని ఆటగాళ్లందరూ తమ వ్యక్తిగత మైల్‌స్టోన్స్ మీదే దృష్టి సారించారు. అదే పాక్ జట్టుని నాశనం చేసింది. ఈ కారణం వల్లే పాక్ జట్టు టీ20 వరల్డ్‌కప్ నుంచి నిష్ర్కమించింది’’ అని అహ్మద్ షెహబాజ్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో.. సోషల్ మీడియాలో డప్పు కొడుతున్నట్టు బాబర్ ఆజం కింగ్ కాదని విమర్శించాడు. క్రికెట్‌లో రాజకీయాలు ఎక్కువైపోయాయని, ఎవరిని పడితే వారిని జట్టులో తీసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ కేవలం ఫ్రెండ్‌షిప్‌ని మెయింటెయిన్ చేస్తూ వచ్చాడని తూర్పారపట్టాడు. పాక్ జట్టు పరిస్థితి మెరుగుపడాలంటే.. పీసీబీ ఏడెమినిది మంది ఆటగాళ్లను తొలగించాల్సిందేనని పేర్కొన్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 09:28 AM

Advertising
Advertising