ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన ఆఫ్ఘనిస్థాన్.. టోర్నీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణ

ABN, Publish Date - Jun 25 , 2024 | 11:31 AM

టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు పెను సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ భరిత విజయాన్ని సాధించి సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. గ్రూప్-1 నుంచి రెండు విజయాలు సాధించిన ఆఫ్ఘాన్ 4 పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధించింది. కాగా గ్రూప్-8 దశలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు పెను సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ భరిత విజయాన్ని సాధించి సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. గ్రూప్-1 నుంచి రెండు విజయాలు సాధించిన ఆఫ్ఘాన్ 4 పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధించింది. కాగా గ్రూప్-8 దశలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా సెమీ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు అద్భుతం చేశారు. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించారు.


టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా బంగ్లాదేశ్ విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. అయితే లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ బౌలింగ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు పోరాట పటిమచూపారు. 17.5 ఓవర్ల 105 పరుగులకే బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేశారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ 8 పరుగుల తేడాతో చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించి సగర్వంగా సెమీఫైనల్ చేరింది.


ఆఫ్ఘనిస్థాన్ స్టార్ బౌలర్లు రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ చెరో 4 వికెట్లతో బంగ్లాదేశ్‌ను చావుదెబ్బ కొట్టారు. ఫజల్‌హక్ ఫరూకీ 1 వికెట్ తీయగా మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.

లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిట్టన్ దాస్ మాత్రమే రాణించాడు. 49 బంతుల్లో 54 పరుగులతో చివరి వరకు క్రీజులో నిలిచాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో అతడి పోరాటం వృథా పోయింది. బంగ్లాదేశ్ మిగతా బ్యాటర్లలో టాంజీద్ హసన్ 0, శాంటో 5, షకీబ్ అల్ హసన్ 0, సౌమ్య సర్కార్ 10, తౌహిద్ హృదయ్ 14, మహ్మదుల్లా 6, రషీద్ హోసెన్ 0, టాంజీమ్ హసాన్ షకీబ్ 3, టస్కీన్ అహ్మద్ 2, ముస్తాఫీజుర్ రెహ్మన్ 0 చొప్పున పరుగులు చేశారు. కాగా ఈమ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన నవీన్ఉల్ హక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.


సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో ఆఫ్ఘనిస్థాన్ ఢీ

బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీఫైనల్‌ చేరిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. జూన్ 27న ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇదే రోజున రాత్రి 8 గంటలకు రెండో సెమీఫైనల్‌లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. గెలిచిన జట్లు 29న ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి.

Updated Date - Jun 25 , 2024 | 11:50 AM

Advertising
Advertising