ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Australia Squad: భారత్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. బిగ్ సర్‌ప్రైజ్

ABN, Publish Date - Nov 10 , 2024 | 08:09 AM

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 22 నుంచి ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు జట్టును ఆసీస్ ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టును వెల్లడించింది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న నాథన్ మెక్‌స్వీనీ ఓపెనర్‌గా ఎంపిక చేసింది.

Nathan McSweeney

పెర్త్: భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 22 నుంచి ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు జట్టును ఆసీస్ ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టును వెల్లడించింది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న నాథన్ మెక్‌స్వీనీ ఓపెనర్‌గా ఎంపిక చేసింది. కొత్త కుర్రాడిని ఓపెనర్‌గా ఎంపిక చేయడం బిగ్ సర్‌ఫ్రైజ్‌గా ఉంది. అరేంగేట్ర మ్యాచ్‌లో ఎలా ఆడబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆశ్చర్యకరంగా జాస్ ఇంగ్లిస్‌కు కూడా జట్టులో చోటు దక్కింది.

కాగా డేవిడ్ వార్నర్ ఈ ఏడాది జనవరిలో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ స్థానంలో సమర్థవంతమైన ఆటగాడి కోసం అన్వేషిస్తోంది. ఉస్మాన్ ఖవాజా సరైన జోడి కోసం వెతుకుతోంది. స్టీవ్ స్మిత్ కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు. దీంతో అతడిని నాలుగవ స్థానంలోనే ఆడించాలని నిర్ణయించారు. దీంతో భారత్‌తో తొలి టెస్టులో మార్నస్ లాబూషేన్ మూడవ స్థానంలో, స్మిత్ నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు.


ఆస్ట్రేలియా జట్టు ఇదే

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జాస్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జాస్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.


మెక్‌స్వీనీపై సెలక్టర్ల విశ్వాసం

భారత్‌తో తొలి టెస్టులో ఓపెనింగ్ చేయబోతున్న సౌత్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ మెక్‌స్వీనీ వయసు 25 సంవత్సరాలు. దేశవాళీ సీజన్‌లో ఆకట్టుకునే ఓపెనింగ్స్ ఇస్తున్నాడు. మార్కస్ హారిస్. కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, సామ్ కాన్స్టాస్‌‌లతో పోటీ ఉన్నప్పటికీ మెక్‌స్వీనీ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారు. గత 15 రోజుల వ్యవధిలో ఆస్ట్రేలియా-ఏ వర్సెస్ భారత్-ఏ మధ్య జరిగిన రెండు టెస్టుల్లో అతడు సమర్థవంతంగా రాణించాడు. మాకేలో జరిగిన తొలి మ్యాచ్‌లో 88 పరుగులతో మెక్‌స్వీనీ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రెండో మ్యాచ్‌లో ఓపెనర్‌గా ప్రమోట్ చేశారు. ఈ మ్యాచ్‌‌లో కేవలం 14, 25 పరుగులు మాత్రమే చేసినప్పటికీ అతడిపై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ‘‘దేశవాలీ క్రికెట్‌లో ఇటీవలి మంచి రికార్డుతో పాటు టెస్ట్ క్రికెట్‌కు సంబంధించిన టాలెంట్‌ను ప్రదర్శించాడు’’ అని ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపారు. దక్షిణ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా-ఏ జట్ల తరపున అతడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని చెప్పారు. టెస్ట్ క్రికెట్‌లో అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నాడని తాము ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపారు.

Updated Date - Nov 10 , 2024 | 08:19 AM