ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh vs South africa: బంగ్లాతో దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్.. కీలక ప్లేయర్లు దూరం

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:27 AM

దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు పోటాపోటీగా బరిలోకి దిగాయి. అయితే, రెండు జట్లలోనూ ఈ సారి కీలక ప్లేయర్లు ఆటకు దూరంగా ఉన్నారు.

Bangladesh vs South Africa

మిర్పూర్: దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ల మధ్యన సోమవారం ఉదయం రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. మిర్పూర్ లోని షేర్ ఎ బంగ్లా స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఉదయం 9: 30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ మ్యాచ్ ను వీక్షించవచ్చు. ఈ మ్యాచ్ కు లైవ్ స్ట్రీమింగ్ లేని కారణంగా ఫ్యాన్ కోడ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఇరు జట్లు పోటాపోటీగా బరిలోకి దిగాయి. అయితే, రెండు జట్లలోనూ ఈ సారి కీలక ప్లేయర్లు ఆటకు దూరంగా ఉన్నారు.


నజ్ముల్ హుస్సేన్ సారథిగా ఉన్న బంగ్లా జట్టులో షకీల్ అల్ హసన్ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. మొదట టీం లో అతని పేరు ప్రకటించినప్పటికీ బంగ్లాదేశ్ లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అతడు మ్యాచ్ ఆడలేకపోయాడు. టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ను అనౌన్స్ చేసిన అనంతరం సొంత గడ్డపై చివరి టెస్టు ఆడాలన్న షకీబ్ కల నెరవేరలేదు. భారత్ తో కాన్పూర్ లో జరిగిన టెస్టు షకీబ్ కు ఆఖరి టెస్టు అయ్యింది. అతడి స్థానంలో హసన్ మురాద్ కు చోటు దక్కింది.


ఇక సౌత్ ఆఫ్రికా జట్టులోనూ టెంబా బవుమా లేని లోటు తెలియనుంది. గాయం కారణంగా అతడి స్థానాన్ని ఎయిడెన్ మార్క్రమ్ తో భర్తీ చేశారు. ఈ టెస్టు సీరిస్ కు కెప్టెన్ గా మార్క్రమ్ కొనసాగున్నాడు.

Updated Date - Oct 21 , 2024 | 11:32 AM