ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gautam Gambhir: ఆరోజు గంభీర్, జై షా మధ్య జరిగిన సంభాషణ ఇదే..!

ABN, Publish Date - May 28 , 2024 | 10:09 PM

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆ బాధ్యతలను గౌతమ్ గంభీర్ చేపట్టనున్నాడన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న విషయం..

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసిన తర్వాత ఆ బాధ్యతలను గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) చేపట్టనున్నాడన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన గానీ, గంభీర్ నుంచి స్పందన గానీ రాలేదు కానీ.. దాదాపు అతనే హెడ్ కోచ్‌గా కన్ఫమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. ఐపీఎల్-2024 (IPL 2024) ఫైనల్‌లో కేకేఆర్ (KKR) మ్యాచ్ గెలిచాక బీసీసీఐ సెక్రటరీ జై షాతో (Jay Shah) కలిసి గంభీర్ కనిపించడం, ఇద్దరి మధ్య ఎక్కువసేపు సంభాషణలు జరగడం చూసి.. హెడ్ కోచ్ అతడేనన్న ప్రచారం మరింత జోరందుకుంది.


తాగడానికి ఒప్పుకోలేదని ఇంత దుర్మార్గమా.. డాబాపైన నలుగురు కలిసి..

ఇలాంటి తరుణంలో.. ఆరోజు గంభీర్, జై షా మధ్య జరిగిన సంభాషణ ఏంటనే విషయంపై ఓ ఆసక్తికర చర్చ క్రీడావర్గాల్లో జోరుగా సాగుతోంది. ‘దేశ్ కే లియే యే కర్నా హై’ (దేశం కోసం మనం ఇది చేయాలి) అని ఆ ఇద్దరూ మాట్లాడుకున్నారని వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ విజయంలో మెంటార్‌గా గంభీర్ పాత్ర అత్యంత ప్రధానమైంది కావడం.. ఆ గెలుపు తర్వాత వీళ్లిద్దరి ఈ సంభాషణ జరగడాన్ని బట్టి చూస్తే.. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా దాదాపు ఖరారయ్యాడన్న వాదనలకు బలం చేకూరుతోంది. అయితే.. దీనిపై అధికారికంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ గంభీర్ నిజంగానే ఆ బాధ్యతలు చేపడితే మాత్రం.. భారత జట్టు రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయమని క్రీడాభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

టీచరమ్మా.. రీల్స్ కోసం ఇదేం పాడు పని.. మరీ ఇంత అవసరమా?

అయితే.. ఇక్కడే ఒక మెలిక కూడా వచ్చిపడింది. అదేంటంటే.. హెడ్ కోచ్ పాత్ర కోసం గంభీర్ దరఖాస్తు చేశాడా? లేదా? అనేది అధికారిక నిర్ధారణ లేదు. ఒకవేళ దరఖాస్తు చేయకపోతే.. ఈ హెడ్ కోచ్ రేసులో గంభీర్ లేనట్టే. మరోవైపు.. తన జట్టుకి మెంటార్‌గా సుదీర్ఘకాలం పాటు గంభీర్ కొనసాగాలని కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ కోరినట్లు ఇదివరకే ఓ నివేదిక తెలిపింది. దాదాపు 10 సంవత్సరాల పాటు కేకేఆర్‌తో ప్రయాణం కొనసాగించేందుకు గాను, షారుఖ్ అతనికి ఖాళీ చెక్కును కూడా అందించినట్లు తెలిసింది. మరి, చివరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Updated Date - May 28 , 2024 | 10:09 PM

Advertising
Advertising