NZ vs ENG: షాకింగ్.. ఒంటిచేత్తో గాల్లోకి లేచిన క్రికెటర్.. ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసుండరు
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:04 AM
బంతిని క్యాచ్ పట్టేందుకు ఓ క్రికెటర్ చేసిన మాయాజాలం అక్కడున్నవారిని ఖంగుతినేలా చేసింది. ఉన్నట్టుండి గాల్లోకి లేచిన క్రికెటర్ ను చూసి అభిమానులు నోరెళ్లబెట్టారు.
క్రైస్ట్‌చర్చ్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆలీ పోప్‌ను అవుట్ చేయడానికి కివీస్ లెజెండరీ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ చేసిన మాయాజాలం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క క్యాచ్ తో తన అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్ ను గ్లెన్ ప్రదర్శించాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న గ్లెన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పోప్ 98 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఫీల్డింగ్‌లో ఫిలిప్స్ వన్-హ్యాండ్ ఫ్లయింగ్ క్యాచ్ తో అతని ఇన్నింగ్స్‌ను ఆకస్మికంగా ముగించాడు. క్యాచ్ ను అందుకునేందుకు ఒంటి చేత్తో గాల్లోకి లేచిన గ్లెన్ బంతిని ఒడిసిపట్టుకుని నేలపై ల్యాండయ్యాడు. కళ్లు చెదిరే ఈ క్యాచ్ అతడి కెరీర్లోనే స్పెషల్ గా నిలవనుంది. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది ఇయర్ ఇదే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 53వ ఓవర్‌లో పోప్, బ్రూక్‌లు ఐదో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇది జరిగింది. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ సౌథీని కోసం తీసుకున్న నిర్ణయం ఆతిథ్య జట్టుకు మేలు చేసింది. పోప్‌ను అతని రెండవ డెలివరీలో అవుట్ చేసి అదరగొట్టాడు.
Updated Date - Nov 29 , 2024 | 12:37 PM