David Warner: ’సాండ్‌పేపర్‘ స్కాం: వార్నర్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత
ABN, Publish Date - Oct 25 , 2024 | 10:52 AM
ఎట్టకేలకు డేవిడ్ వార్నర్‌కు భారీ ఊరట లభించింది. వార్నర్ కెప్టెన్సీపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేస్తున్నాట్టుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు తాజాగా వెల్లడించింది.
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. డేవిడ్ వార్నర్ పై జీవిత కాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేసింది. 2018 లో సాండ్ పేపర్ స్కాంలో డేవిడ్ వార్నర్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో ఆనాటి నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు ఈ ప్లేయర్ పై బ్యాన్ విధించింది. ఆనాటి నుంచి తన పై నిషేధాన్ని ఎత్తివేయాలని వార్నర్ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎన్నో సార్లు తనపై బ్యాన్ ఎత్తివేయాలని రిక్వెస్ట్ చేశాడు. తాజాగా ముగ్గురు సభ్యులతో కూడిన రివ్యూ ప్యానెల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
’’వార్నర్ విషయంలో సమీక్ష చేపట్టిన అనంతరం రివ్యూ పానెల్ మాట్లాడుతూ.. వార్నర్ జరిగిన తప్పు విషయంలో బాధ్యత తీసుకున్నాడు. నిషేధం ఎదుర్కొంటున్న సమయంలోనూ అతడి ప్రవర్తన, కాండక్ట్ సరిగ్గానే ఉంది. ప్రత్యర్థి జట్టుపై కవ్వింపులకు దిగడం, స్లెడ్జింగ్ లాంటి వాటికి పాల్పడినట్టుగా ఎక్కడా చేయలేదు. ప్యానెల్ వార్నర్ పట్ల మంచి ఉద్దేశంతోనే ఉంది. అందుకే అతడిపై బ్యాన్ ను ఎత్తివేస్తున్నాం‘‘ అని ప్యానెల్ తెలిపింది.
బిగ్‌బాష్ లీగ్ కు లైన్ క్లియర్
బ్యాన్ కారణంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియాకు సంబంధించిన లీగుల్లోనూ వార్నర్ ఆడలేదు. తాజా ప్రకటనతో ఫ్రాంచైజీ జట్టు కెప్టెన్ గా బిగ్ బాష్ లీగ్ కు దిగే చాన్స్ ఉంది. సిడ్నీ థండర్స్ కు వార్నర్ నాయకత్వం వహించనున్నాడు.
ఆరేళ్ల పోరాటం ఫలించిన వేళ..
2018లో నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆసిస్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. రెండో ఇన్నింగ్స్ సమయంలో ఆసీస్ ప్లేయర్ బాన్ క్రాఫ్ట్ బంతిని రుద్దుతున్నట్టుగా గమనించిన ప్రత్యర్థి టీం వారిపై అనుమానంతో ఫిర్యాదు చేసింది. సాండ్ పేపర్ లా ఉన్న గుడ్డముక్కను జేబులో దాచినట్టుగా వారు ఆరోపించారు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో బాన్ క్రాఫ్ట్ ఆ విషయాన్ని అంగీకరించాడు. దీంతో జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, బాన్ క్రాఫ్ట్ తో పాటు వైస్ కెప్టెన్ గా ఉన్న వార్నర్ పైనా వేటు పడింది.
IPL: ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ బౌలింగ్ చేసిన బౌలర్.. ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్ ఎవరంటే..
Updated Date - Oct 25 , 2024 | 11:13 AM