ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deepti Sharma: దీప్తి శర్మ అరుదైన రికార్డు.. రోహిత్, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదుగా..!!

ABN, Publish Date - Jan 08 , 2024 | 08:54 PM

Deepti Sharma: టీమిండియా మహిళా క్రికెటర్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రావంటి దిగ్గజాల‌కు సాధ్యంకాని రికార్డును త‌న పేరిట లిఖించుకుని చరిత్ర సృష్టించింది. టీ20ల్లో 1,000 ప‌రుగులు పూర్తి చేసుకోవ‌డంతో పాటు వంద వికెట్లు తీసిన తొలి భార‌త క్రికెట‌ర్‌గా దీప్తి రికార్డు సాధించింది.

టీమిండియా మహిళా క్రికెటర్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రావంటి దిగ్గజాల‌కు సాధ్యంకాని రికార్డును త‌న పేరిట లిఖించుకుని చరిత్ర సృష్టించింది. టీ20ల్లో 1,000 ప‌రుగులు పూర్తి చేసుకోవ‌డంతో పాటు వంద వికెట్లు తీసిన తొలి భార‌త క్రికెట‌ర్‌గా దీప్తి రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దీప్తి శ‌ర్మ ఈ ఘ‌నత సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 30 ప‌రుగుల‌ు చేసిన దీప్తి... బౌలింగ్‌లో కూడా రాణించి రెండు కీల‌క వికెట్లు తీసింది.

కాగా మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య రెండో టీ20 జరిగింది. తొలి టీ20లో ఓడిన భారత్.. రెండో టీ20లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే టీమిండియా నామామత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లు రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 131 పరుగుల టార్గెట్‌ను 19 ఓవర్లలోనే ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 08:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising