ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cricket News: ప్రేక్షకులు లేకుండానే పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్.. కారణం ఏంటో తెలుసా?

ABN, Publish Date - Aug 15 , 2024 | 12:40 PM

కరాచీ వేదికగా ఈ నెల 30 నుంచి పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ షురూ కానుంది. అయితే ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్‌ జరగనుంది.

Pakistan Vs Bangladesh

కరాచీ వేదికగా ఈ నెల 30 నుంచి పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ షురూ కానుంది. అయితే ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్‌ జరగనుంది. స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించొద్దని నిర్ణయించామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది.


వచ్చే ఏడాది పాకిస్థాన్‌ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీసీబీ స్టేడియాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పాక్-బంగ్లా జట్ల మధ్య జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న మైదానంలో కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరాచీ టెస్ట్ మ్యాచ్‌కు స్టేడియంలోకి అభిమానులను అనుమతించబోమని పీసీబీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.


‘‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జరుగుతున్న సన్నాహాల్లో భాగంగా స్టేడియంలో కొనసాగుతున్న నిర్మాణ పనుల దృష్ట్యా పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య ఆగస్టు 30 నుంచి జరగాల్సిన రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించొద్దని పీసీబీ నిర్ణయించింది. సెప్టెంబర్ 3 వరకు ప్రేక్షకులకు అనుమతి లేదు. మన క్రీడాకారులకు ప్రోత్సాహం, ఉత్సాహం అందించేందుకు ఔత్సాహిక మద్దతుదారులది కీలక పాత్ర అని మేము అర్థం చేసుకున్నాం. కానీ అన్ని ఆప్షన్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌ను నిర్వహించడం సురక్షితమని నిర్ధారించాం’’ అని ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది.


కాగా పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. రెండో టెస్టు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు, తొలి టెస్ట్ ఆగస్టు 21న రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది. పీసీబీ ప్రకటనతో రెండవ మ్యాచ్ టికెట్ విక్రయాలను వెంటనే ఆపివేశారు. ఇక ఇప్పటికే టిక్కెట్‌ కొనుగోలు చేసిన అభిమానులకు డబ్బును తిరిగి చెల్లిస్తామని పీసీబీ హామీ ఇచ్చింది. ఇదిలావుండగా టెస్టు సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు మంగళవారమే పాకిస్థాన్ చేరుకుంది.


బంగ్లాదేశ్ టెస్ట్ జట్టు ఇదే..

హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహీద్ రానా, షోరీ ఇస్లాం హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్.

Updated Date - Aug 15 , 2024 | 12:40 PM

Advertising
Advertising
<