T20 World Cup: ఇదొక చెత్త సెలక్షన్.. ఆ ప్లేయర్‌ని పక్కన పెట్టడమేంటి?
ABN, Publish Date - May 01 , 2024 | 05:45 PM
భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ భారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అయితే..
భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వం వహించనున్నాడు. అయితే.. ఈ జట్టులో రింకూ సింగ్‌కి (Rinku Singh) స్థానం కల్పించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్నాయి. ధోనీలాగా అద్భుతంగా ఫినిషింగ్ ఇవ్వగల సత్తా అతని సొంతమని.. అలాంటి రింకూని ఎందుకు ఎంపిక చేయలేదని క్రికెట్ మాజీలు, విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం ముంబై జట్టుకి పెద్ద షాక్.. హార్దిక్ పాండ్యాకి భారీ దెబ్బ
భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ సైతం.. రింకూని సెలక్ట్ చేయకపోవడం పట్ల తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ఏడాది జనవరి వరకు రెండు అర్ధశతకాలతో 176 స్ట్రైక్ రేటుతో పరుగుల చేసిన రింకూకి.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో స్థానం ఇవ్వకపోవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ రింకూ నిరూపించుకున్నాడని, అలాంటి వ్యక్తిని ఎలా డ్రాప్ చేస్తారని ప్రశ్నించారు. దక్షిణాఫ్రికాలో విజయాలను అందించే ఇన్నింగ్స్‌లను రింకూ ఆడాడని, అలాగే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒంటిచేత్తో జట్టును ఆదుకున్నాడని ఆయన గుర్తు చేశారు. ప్రపంచం మొత్తం రింకూ గురించి మాట్లాడుకుంటోందన్నారు. ఇదొక చెత్త సెలక్షన్ అని, ఈ ఎంపిక పట్ల తాను సంతోషంగా లేనని తేల్చి చెప్పారు. అసలు నలుగురు స్పిన్నర్లు ఎందుకని నిలదీసినా శ్రీకాంత్.. ఎవరో కొందరిని సంతోష పెట్టడానికి జట్టును ఎంపిక చేశారని, ఈ క్రమంలో రింకూని బలిపశువుగా మార్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా తప్పించి.. రింకూని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
క్యాన్సర్ పేషెంట్‌కి బంపరాఫర్.. ఏకంగా రూ.10 వేల కోట్లు
అటు ఆకాశ్ చోప్రా సైతం రింకూని జట్టులో తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. టీ20ల్లో విస్మరించలేని ఆటగాడు రింకూ అని, అతడు జట్టులో లేకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ఆరు నెలల క్రితం మనం టీమ్‌ను ఊహించుకొంటే.. 11 మందిలో తొలుత అతడి పేరే ఉండేదని గుర్తు చేశారు. ఐపీఎల్‌లో అతనికి కోల్‌కతా తగినన్ని బ్యాటింగ్ అవకాశాలు ఇవ్వలేదని, ఇదే అతని ఎంపికపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. అలాగే.. జట్టులో ఆల్‌రౌండర్లు లేకపోవడం కూడా రింకూ సెలక్షన్‌పై ఇంపాక్ట్ చూపించిందన్నారు. బౌలర్ కాకపోవడం వల్లే రింకూకి ఛాన్స్ దక్కలేదని పేర్కొన్నారు. జట్టులో లెఫ్ట్‌హ్యాండర్ల సంఖ్య పెరగడం కూడా రింకూను ట్రావెల్ రిజర్వ్‌కు పరిమితం చేయడానికి కారణం కావొచ్చని చెప్పుకొచ్చారు.
Read Latest Sports News and Telugu News
Updated Date - May 01 , 2024 | 05:45 PM