ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Garry Kirsten: వాళ్లతో పెట్టుకోవద్దని ముందే చెప్పా.. పాక్‌కు మంటపుట్టిస్తున్న భజ్జీ పోస్ట్

ABN, Publish Date - Oct 30 , 2024 | 03:14 PM

నాలుగు నెలలు తిరగకముందే కోచ్ రాజీనామా చేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన పాత పోస్ట్ ను కొందరు నెటిజన్లు మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇది పాక్ అభిమానులను తెగ ఇబ్బంది పెడుతోంది.

Harbhajan singh Garry Kirsten

ముంబై: పాక్ జట్టుకు కోచ్ గ్యారీ కిర్ స్టన్ రాజీనామా చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కోచ్ రాజీనామాకు ఆటగాళ్ల దురుసు ప్రవర్తనే కారణమని చెప్తున్నారు. పీసీబీతోనూ కిర్ స్టన్ కు ఏమాత్రం పొసగడం లేదని అందుకే ఆ జట్టు నుంచి వైదొలిగే నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ విషయంలో కిర్ స్టన్ ను టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అప్పట్లోనే హెచ్చరించాడు. పాకిస్తాన్ టీం నీకు సరైనది కాదు నువ్వు తిరిగి టీమిండియాలోకి వచ్చేయ్ అంటూ భజ్జీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అచ్చం అతను చెప్పినట్టే నాలుగు నెలలు తిరగకముందే కోచ్ రాజీనామా చేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన పాత పోస్ట్ ను కొందరు నెటిజన్లు మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇది పాక్ అభిమానులను తెగ ఇబ్బంది పెడుతోంది.


భజ్జీ అప్పుడే చెప్పాడు..

‘గ్యారీ.. నీ టైమ్ వేస్ట్ చేసుకోకు. పాకిస్తాన్ జట్టును వదిలెయ్. టీమిండియాలో జాయిన్ అవ్వు. భారత టీమ్‌కు కోచింగ్ ఇవ్వడానికి తిరిగొచ్చేయ్’ అని హర్భజన్ తన పోస్టులో తెలిపాడు. కిర్‌స్టన్‌ను సూపర్ కోచ్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడు గొప్ప మెంటార్ అని, అలాంటోడు టీమ్‌తో ఉంటే చాలా బెనిఫిట్ అని పేర్కొన్నాడు. ప్రపంచ కప్-2011 గెలిచిన తమ టీమ్‌కు కిర్​స్టెన్ మంచి ఫ్రెండ్ అన్నాడు. అతడు ఉండాల్సింది పాక్ టీమ్‌తో కాదని.. భారత్​తో అంటూ హర్భజన్ ఆ సమయంలో తన అభిమానాన్ని పంచకున్నాడు.


అప్పుడే కుండబద్దలు కొట్టాడు..

అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన కిర్‌స్టన్ పాక్ టీంను మాత్రం హ్యాండిల్ చేయలేకపోయాడు. టీమిండియాకు కోచ్‌గా ఉంటూ 2011 వన్డే వరల్డ్ కప్​అందించిన ఘనత అతడి సొంతం. అలాంటోడు ఇప్పుడు పాక్‌కు కోచ్​గా వెళ్లాడు. కానీ పొట్టి కప్పులో ఆ టీమ్ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లోనే తొలిసారిగి కిర్ స్టన్ పాక్ జట్టు వైఖరిపై కుండబద్దలు కొట్టాడు.


పాక్ టీంపై గ్యారీ అసహనం

పాక్ జట్టులో ఐకమత్యం లేదని.. అసలు ఇది టీమే కాదన్నాడు. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో చాలా జట్లకు ట్రెయినింగ్ ఇచ్చానని.. కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని కిర్​స్టెన్ చెప్పినట్లు తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు రూమర్స్ వినిపించాయి. టీమిండియాతో మ్యాచ్​లో గెలిచే పరిస్థితిలో ఉండి కూడా ఓడిపోవడం దారుణమంటూ కోచ్ తీవ్ర నిరాశకు గురయ్యాడట.

Bangladesh: బంగ్లా జట్టుకు కెప్టెన్ కొరత.. నేనున్నానంటున్న సీనియర్ ప్లేయర్


Updated Date - Oct 30 , 2024 | 03:19 PM