Rohit Sharma: రోహిత్ శర్మను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 05 , 2024 | 07:03 AM
ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ లేదా రెండవ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. తన భార్య రితికా రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో కీలకమైన ఈ సమయంలో భార్య తోడుగా ఉండాలని అతడు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ముంబై: ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ లేదా రెండవ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. తన భార్య రితికా రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో కీలకమైన ఈ సమయంలో భార్యకు తోడుగా ఉండాలని అతడు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తలపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ శర్మ ఒకటి కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లకు దూరమైతే జస్ప్రీత్ బుమ్రాను భారత జట్టు కెప్టెన్‌గా నియమించాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై టీమిండియా మేనేజ్‌మెంట్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత కెప్టెన్ మొదటి మ్యాచ్ ఆడటం చాలా కీలకమని ఆయన సూచించారు. ఈ మేరకు ‘స్పోర్ట్స్ టాక్’తో ఆయన మాట్లాడారు. తొలి టెస్టుకు అందుబాటులో ఉంటారా లేదా అనే అంశంపై... ముంబై టెస్ట్ అనంతరం రోహిత్ శర్మను ప్రశ్నించగా.. షెడ్యూల్ గురించి ఇంకా కచ్చితంగా చెప్పలేనని, మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.
కాగా రోహిత్ శర్మ రెండవ టెస్ట్ మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. కాబట్టి తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
గవాస్కర్ ఇంకా ఏమన్నారంటే..
‘‘తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడడం కెప్టెన్‌కు చాలా ముఖ్యం. గాయపడితే అది వేరు. కెప్టెన్ అందుబాటులో లేకుంటే వైస్ కెప్టెన్ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాడు. రోహిత్ శర్మ ఆడకపోవచ్చని నేను కథనాలు చదువుతున్నాను. అదే జరిగితే ఆస్ట్రేలియా సిరీస్ మొత్తానికి జస్ప్రీత్ బుమ్రాను టెస్టులకు కెప్టెన్‌గా సెలక్షన్ కమిటీ ప్రకటించాలి. ఈ సిరీస్‌లో ఒక ప్లేయర్‌గా కొనసాగాలని రోహిత్ శర్మకు మేనేజ్‌మెంట్ చెప్పాలని నేను భావిస్తున్నాను. తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ తప్పనిసరిగా ఉండాలి’’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
కాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు దారుణంగా విఫలమైంది. వ్యక్తిగత ప్రదర్శన విషయంలో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల్లో కలిపి కనీసం100 పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో రోహిత్ శర్మ ఫామ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత జట్టు మరో 4 విజయాలు సాధించాల్సి ఉంది. నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాలనుకుంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు.
ఇవి కూడా చదవండి
ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్‌డే.. ఎన్నేళ్లు నిండాయో తెలుసా
విమానాల్లో ప్రయాణిస్తుంటారా.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
అమెరికాలో ఇవాళే అధ్యక్ష ఎన్నికలు.. ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా
నాలుగేళ్ల తర్వాత తొలిసారి.. చైనా సరిహద్దులో..
For more Sports News and Telugu News
Updated Date - Nov 05 , 2024 | 11:06 AM