ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs AUS: సొంత క్రికెటర్లను పక్కన పెట్టిన ఆస్ట్రేలియా మీడియా.. కోహ్లీకి గ్రాండ్ వెల్‌కమ్

ABN, Publish Date - Nov 12 , 2024 | 01:06 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ ను ఆస్ట్రేలియన్ మీడియా ఆకాశానికెత్తేసింది. ప్రముఖ వార్తాపత్రికలు తమ మొదటి పేజీ లో అతడి కథనాన్ని ప్రచురించడం మనోళ్ల మేనియా విదేశీయులను ఎంతలా ఊపేస్తోందో తెలుస్తోంది.

Virat Kohli

పెర్త్: ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు పెర్త్ చేరుకుంది. ముందుగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు. అక్కడికి చేరుకోగానే ఆస్ట్రేలియన్ మీడియా అతడికి గ్రాండ్ వెల్కం ఇచ్చింది. ప్రముఖ వార్తా పత్రిక అతడి ఫొటోను ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. యుగోంకి లడాయి(యుగాల యుద్ధం) అంటూ కీర్తించింది. బోల్డ్ హెడ్ లైన్ ను హిందీలో ప్రచురించడం మరో విశేషం. మరో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ కథనాలను కూడా కొన్న ప్రాంతీయ పేపర్లలో హెడ్ లైన్స్ లో కనిపించాయి. భారత క్రికెటర్ల మేనియా ఆస్ట్రేలియాలో ఏ రేంజ్ లో ఉందో తెలిసేలా ఈ క్రికెట్ హీరోలను ఆస్ట్రేలియన్ మీడియా కొనియాడింది.


విరాట్ కెరీర్ లో కీలక మ్యాచ్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విరాట్ కోహ్లీకి ఎంతో కీలకం కానుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్న అతను ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో పరుగులు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి బ్యాటింగ్‌లో 192 పరుగులు మాత్రమే వచ్చాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోనూ, అతను 15.50 సగటుతో 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తన ప్రదర్శనతో విరాట్ విమర్శలపాలయ్యాడు.


కోహ్లీని పక్కన పెట్టేస్తారా..?

ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్ అతని టెస్ట్ కెరీర్‌కు నిర్ణయాత్మకంగా మారవచ్చు. ఏది ఏమైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఆర్ అశ్విన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే వారిని కూడా పక్కన పెట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్న మాట.

టెలిగ్రాఫ్ "యుగాల యుద్ధం" అని రాసింది

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఘోరంగా పరాజయం పాలైనప్పటికీ, క్రికెట్‌లో అతని స్థాయి ఎంటో అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా వార్తాపత్రికల మొదటి పేజీలలో కోహ్లీ ప్యూర్ డామినేషన్ కనిపించింది. టెలిగ్రాఫ్ తన మొదటి పేజీలో విరాట్ కోహ్లీని హైలెట్ చేయడమే కాకుండా “యుగాల నాటి యుద్ధం” అనే హిందీ శీర్షికను కూడా రాసింది.


యశస్వి జైస్వాల్ “న్యూ రాజా”

కోహ్లీతో పాటు యువ ఓపెనర్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వార్త కూడా ఇతర వార్తాపత్రికలలో ప్రముఖంగా ప్రచురించారు. పంజాబీలో “నవం రాజా” (నయా రాజా) అనే హెడింగ్ తో హైలెట్ చేసింది.

KL Rahul: కావాలనే బయటకొచ్చేశా.. నా టార్గెట్ అదే: కేఎల్ రాహుల్


Updated Date - Nov 12 , 2024 | 01:07 PM