ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: వైజాగ్ టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ!

ABN, Publish Date - Feb 01 , 2024 | 01:22 PM

శుక్రవారం నుంచి భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతున్న వేళ ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు.

వైజాగ్: శుక్రవారం నుంచి భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతున్న వేళ ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ లీచ్ గాయడపడ్డాడు. అతని మోకాలికి గాయమైంది. అయినప్పటికీ గాయంతో బాధపడుతూనే బౌలింగ్ చేశాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అధికారికంగా ధృవీకరించాడు. ‘‘దురదృష్టవశాత్తూ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి కుడి కాలిలో వాపు వచ్చింది. జాక్ లీచ్ జట్టుకు దూరం కావడం మాకు గట్టి ఎదురుదెబ్బ. చాలా రోజుల తర్వాత జాక్ లీచ్ జట్టులోకి వచ్చాడు. కానీ ఇంతలోనే ఇలా జరగడం బాధకరం.’’ అని చెప్పాడు. కాగా హైదరాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసిన లీచ్ ఒక వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు.


ఇక గాయపడిన జాక్ లీచ్ స్థానంలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే వైజాగ్ టెస్ట్ ద్వారా ఇంగ్లండ్ తరఫున షోయబ్ బషీర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఈ విషయంపై స్టోక్స్ మాట్లాడుతూ షోయబ్ బషీర్ అరంగేట్రం గురించి తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. అవకాశం వస్తే మాత్రం అతని కెరీర్‌లోనే దీనిని మరుపురాని టెస్టుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. ఎందుకంటే ఏ ఆటగాడికైనా అరంగేట్రం టెస్టు ఆడే అవకాశం ఒకేసారి వస్తుందని స్టోక్స్ చెప్పాడు. వైజాగ్ టెస్టుకు ముందు టీమిండియాకు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. టీమిండియా కీలక ఆటగాళ్లైనా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా గాయాల కారణంగా రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 01:23 PM

Advertising
Advertising