ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs NZ: కివీస్‌తో మ్యాచ్.. టీమిండియా జట్టు‌లోకి యువ సంచలనం

ABN, Publish Date - Oct 29 , 2024 | 05:51 PM

న్యూజిలాండ్ తో జరగనున్న చివరి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా సన్నద్ధతను పెంచింది. ఊహించని విధంగా కొత్త కుర్రాడికి ఈ మ్యాచ్ లో చాన్స్ ఇవ్వనుంది.

Team India

ముంబై: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే కివీస్ చేతిలో రెండు మ్యాచ్ లు ఓడి టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోలింగ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ మ్యాచ్ కు కొత్త కుర్రాడికి చాన్స్ ఇచ్చి చూస్తోంది. న్యూజిలాండ్ తో చివరి టెస్టుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ కీలక మ్యాచ్ కు ముందు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాకు టీమిండియా నుంచి పిలుపు అందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్ 0-2 తో వెనుకంజలో ఉంది.


ఆ ప్లేయర్‌ను పక్కన పెడతారా?

ఢిల్లీకి చెందిన ఈ యంగ్ ప్లేయర్ ఇటీవల రంజీ ట్రోఫీలో అస్సాంపై విజృంభించి ఆడాడు. 59 పరుగులతో 7 వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. దులీప్ ట్రోఫీలోనూ 8 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. కోచ్ గౌతమ్ గంభీర్ ఈ 22 ఏళ్ల ఆటగాడిపై స్పెషల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ రిజర్వ్ ఆటగాళ్ల స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆకాశ్ దీప్ ను పక్కనపెట్టి హర్షిత్ రానాకు జట్టులో స్థానం కల్పించే చాన్స్ ఉంది. పిచ్ కు తగ్గట్టుగా వేగాన్ని నియంత్రించుకోడంలోనూ ఈ యంగ్ ప్లేయర్ దిట్ట.


తాడో పేడో తేల్చుకోవాలని..

ఇప్పటికే కివీస్ పై మ్యాచ్ నెగ్గలేక తీవ్ర విమర్శలపాలైన టీమిండియా కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వాంఖడే పిచ్ ను గేమ్ కు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు విజయంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని చూస్తోంది.


షమీ స్థానంలో జట్టులోకి..

మహమ్మద్ షమీ అందుబాటులో లేకపోవడంతో పేస్‌ టీమ్ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌తో పాటు హర్షిత్ రాణా కూడా చోటు సంపాదించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జట్టులో ఎంపికయ్యేందుకు ఈ యంగ్ ప్లేయర్ శారీరకంగా ఎంతో శ్రమించాడట. ఏకంగా 17 కేజీల బరువు తగ్గి జట్టులో స్థానం సంపాదించాడు. 6.2 అడుగుల ఎత్తు ఉండే ఈ ప్లేయర్ 140 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్లు వేయగలడు. ఇది బ్యాటర్లను కంగారు పెట్టే అంశం. మరోవైపు ఫిట్ నెస్ పరంగా కూడా రాని తనను తాను మెరుగు పరుచుకున్న తీరు క్రికెట్ పట్ల అతనికున్న ప్యాషన్ ను తెలుపుతోంది.

Glenn Maxwell: అలా అన్నందుకే కోహ్లీ నన్ను బ్లాక్ చేశాడు: ఆసిస్ క్రికెటర్


Updated Date - Oct 29 , 2024 | 06:01 PM