ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs AUS: టీమిండియాకు అతనొక్కడే దిక్కు... పాక్ లెజెండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN, Publish Date - Dec 09 , 2024 | 12:59 PM

టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు అంతా సిద్ధమనుకున్న వేళ ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షమీ అసలు ఆసిస్ పర్యటనలో భాగమవుతాడా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Team India

ముంబై: భారత స్టార్ పేసర్ షమీని నాలుగో టెస్టుకు అందుబాటులో ఉంచడం ద్వారా టీమిండియాకు కొత్తగా ఒరిగే ప్రయోజనాలేమీ ఉండవని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అన్నాడు. రెండో టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో పాల్గొనాల్సి ఉంది. అయితే, షమీని నాలుగో టెస్టులో రంగంలోకి దింపనున్నారనే ప్రచారం జరుగుతోంది. బాసిత్ అలీ మాట్లాడుతూ.. షమీని ఇప్పటికిప్పుడు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కిస్తే తప్ప టీమిండియాకు జరిగిన నష్టాన్ని పూడ్చటం కష్టమని పేర్కొన్నాడు. ఇటీవల రెండో టెస్టులో పది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇటీవల పోస్ట్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్న షమీ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నట్టు చెప్పాడు.


షమీని ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. అలా చేయడం వల్ల టీమిండియాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. షమీని ఇప్పుడే ఆస్ట్రేలియాకు పంపాలి. బ్రిస్బేన్ లో జరగనున్న మూడో టెస్టును అతడితో ఆడించాలి. ఒకవేళ నాలుగో టెస్టులోనే ఆడించాలి అనుకుంటే ఇక అతడు ఆసిస్ వెళ్లా్ల్సిన అవసరమే ఉండకపోవచ్చు. భారత్ కు షమీ అవసరం ఇప్పుడే ఉంది. పేస్ అటాక్ కు అతడు ఉండాల్సిందే అంటూ మూడో టెస్టులో షమీ అవసరాన్ని నొక్కి చెప్పాడు. బీసీసీఐ ఈ ఆటగాడిపై దృష్టి పెట్టాలని సూచించాడు.


షమీ కంబ్యాక్ పై ఇటీవల స్పందించిన రోహిత్ అతడు ఎప్పుడు వచ్చినా టీమిండియాలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, మేమింకా అతడిని పర్యవేక్షిస్తు్న్నాం. ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో షమీ మోకాలికి కాస్త స్వెల్లింగ్ ఉన్నట్టు గుర్తించాం. అతడిని ఇప్పటికిప్పుడు జట్టులోకి తీసుకురాకపోవడానికి అదొక్కటే కారణం అని తెలిపాడు. గాయం కారణంగా సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమైన షమీ.. తన రీ ఎంట్రీతో రికార్డులు బద్దలు కొట్టాడు. మధ్యప్రదేశ్, బెంగాల్ మధ్యజరిగిన టెస్టులో 42 ఓవర్లలో బౌలింగ్ చేశాడు. ఇక సోమవారం జరగనున్న ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్ాయచ్ ను సైతం షమీ ఆడనున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు ఆతిథ్యమివ్వనుంది.

IND vs AUS: టీమిండియా బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు


Updated Date - Dec 09 , 2024 | 01:03 PM