Share News

India vs Zimbabwe: టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN , Publish Date - Jul 10 , 2024 | 04:18 PM

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే, భారత జట్లు బుధవారం మూడో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో..

India vs Zimbabwe: టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
India vs Zimbabwe

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే, భారత జట్లు బుధవారం మూడో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా.. చెరో విజయంతో సమంగా నిలిచాయి.

మొదటి మ్యాచ్‌లో జింబాబ్వే గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో భారత్ అఖండ విజయం సాధించి, అందుకు ప్రతీకారం తీర్చుకుంది. తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే దూకుడు కొనసాగించి, సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు కాబట్టి.. దుమ్ముదులిపేయాలని యువ ఆటగాళ్లు అనుకుంటున్నారు. కాగా.. టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని సభ్యులైన యశస్వి జైస్వాల్, వికెట్‌కీపర్‌ సంజు శాంసన్, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె జింబాబ్వేతో చివరి మూడు టీ20లకు ఎంపికై విషయం తెలిసిందే.


మరోవైపు.. జింబాబ్వే జట్టు కూడా మంచి కసి మీద ఉంది. భారత్‌పై ఆధిపత్యం చెలాయించి, తమపై ఉన్న చిన్న జట్టు ముద్రని చెరిపేసుకొని, వరల్డ్ క్రికెట్‌లో తమదైన సత్తా చాటాలని చూస్తోంది. అందుకు తగినట్టుగానే ఆటగాళ్లు తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండో మ్యాచ్‌లో ఎదురైన పరాభావానికి ఈ మూడో మ్యాచ్‌లో గట్టి సమాధానం ఇవ్వాలని చూస్తున్నారు. మరి.. ఈ హోరాహోరీ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

తుది జట్లు

భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), శివమ్ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్, ఖలీల్ అహ్మద్.

Updated Date - Jul 10 , 2024 | 04:18 PM