ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India vs Sri Lanka: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ABN, Publish Date - Jul 28 , 2024 | 07:32 PM

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఆదివారం భారత్, శ్రీలంక జట్లు రెండో టీ20లో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెకెలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న..

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఆదివారం భారత్, శ్రీలంక జట్లు రెండో టీ20లో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెకెలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఆతిథ్య జట్టు రంగంలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. అదే దూకుడుతో రెండో మ్యాచ్‌లోనై విజయఢంకా మోగించాలని చూస్తోంది. మునుపటిలాగే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శ్రీలంకపై ఆధిపత్యం చెలాయించి.. సిరీస్‌ని కైవసం చేసుకోవాలని అనుకుంటోంది. బహుశా.. ఈ ప్లానింగ్‌లో భాగంగానే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా.. మెడనొప్పి కారణంగా గిల్ ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. దీంతో.. అతని స్థానంలో సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.


మరోవైపు.. తొలి మ్యాచ్‌లో చవిచూసిన పరాజయానికి గాను ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. ఈ రెండో మ్యాచ్ ఓడిపోతే సిరీస్ చేజారుతుంది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడిపోకూడదన్న లక్ష్యంతో ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతోంది. టీమిండియాకు ధీటుగా బదులిచ్చి, తమ సత్తా చాటాలని అనుకుంటోంది. మరి.. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్ శ్రీలంకన్ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి. ఇదిలావుండగా.. వర్షం కారణంగా 7:00 గంటలకే వేయాల్సిన టాస్‌ను 7:15కు వాయిదా వేయాల్సి వచ్చింది.


తుది జట్లు

భారత్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ (కెప్టెన్), రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: నిశాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్‌), కుశాల్ పెరీరా, కామిందు మెండిస్‌, అసలంక (కెప్టెన్), డాసున్ శనక, వానిందు హసరంగ, రమేశ్‌ మెండిస్‌, మహీశ్ తీక్షణ, మతీశా పతిరన, ఫెర్నాండో

Updated Date - Jul 28 , 2024 | 07:32 PM

Advertising
Advertising
<