David Warner: డేవిడ్ భాయ్ బ్యాడ్ లక్.. విధి ఆడిన వింత నాటకం ఇది
ABN, Publish Date - Nov 24 , 2024 | 07:48 PM
ఆదివారం జరిగిన ఐపీఎల్ వేలంలో యంగ్ క్రికెటర్లు కోట్లకు పడగలెత్తారు. కానీ అభిమానుల మనసు దోచిన ఓ సీనియర్ ప్లేయర్‌కు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముందుండి నడిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. సౌత్ పా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత నిలకడైన ఆటతీరుతో మెప్పించాడు. కానీ.. ఈ సారి ఐపీఎల్ వేలంలో ఈ సీనియర్ ఆటగాడిని కొనేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్ అభిమానులను కలచివేసే వార్త ఇది.
జెడ్డాలో ఆదివారం జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అమ్ముడుపోలేదు. 38 ఏళ్ల ఈ ఓపెనర్ ఇటీవల ఆస్ట్రేలియాకు సంబంధించి అన్ని ఫార్మట్లలో నుంచి రిటైరైన సంగతి తెలిసిందే. కారణం ఏదైనా ఈ వేలంలో వార్నర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క జట్టు ముందుకు రాకపోవడం అతడి అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఐపీఎల్ తో పాటు క్రికెట్ ఆటకు ఎన్నో సేవలు అందించిన ఈ సీనియర్ ప్లేయర్ కు ఇది ఘోర అవమానం. వార్నర్ విషయంలో విధి ఆడిన వింత నాటకమిది.
Mohammed Shami: షమీని ఎగరేసుకుపోయిన సన్‌రైజర్స్.. కావ్య పాప అనుకున్నది సాధించింది
Updated Date - Nov 24 , 2024 | 07:48 PM