ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కొత్త ట్విస్ట్.. ఈ సారికి ఇలా కానిచ్చేద్దామని..

ABN, Publish Date - Dec 12 , 2024 | 01:14 PM

ఐసీసీ నిర్వహించాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్దత ఇంకా వీడటం లేదు. ట్రోఫీ షెడ్యూల్ ని ఇప్పటికీ ప్రకటించని ఐసీసీ భారత్- పాక్ మధ్య ఉన్న పీఠముడిని విప్పేందుకు మళ్లగుళ్లాలు పడుతోంది. దీంతో ఇప్పుడు ఈ సస్పెన్స్ కు తెర దించేందుకు పెద్ద ప్లానే వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ మార్పులు జరగనున్నాయి.

Champions Trophy

ముంబై: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పై ఇప్పటివరకు ఎలాంటి షెడ్యూల్ నిఐసీసీ విడుదల చేయలేదు. ఓ వైపు పాకిస్తాన్ లో పర్యటించేందుకు భద్రతా కారణాల రిత్యా భారత్ ససేమిరా అంటుంటే.. భారత్ లో పర్యటించాల్సి వచ్చినప్పుడు మాకు కూడా ప్రత్యేక వెసులుబాటు ఇస్తారా అంటూ పాక్ ప్రశ్నిస్తోంది. ఇప్పుడీ మొత్తం పరిస్థితిని మేనేజ్ చేయలేక అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇబ్బందుల్లో పడింది. దుబాయ్ లో మ్యాచ్ వేదికను ఏర్పాటు చేసేలా హైబ్రిడ్ మోడల్ ను అమలు చేయాలంటూ కొనసాగుతున్న ప్రతిపాదనపైనా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవలేదు. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సి ఉన్న ఐసీసీ మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, అనుకోని కారణాల వల్ల ఈ మీటింగ్ ను కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వస్తున్నట్టు తెలుస్తోంది.


తాజా సమాచారం ప్రకారం ఈ ట్రోఫీ నిర్వహణలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్ లో కాకుండా టీ20 ఫార్మాట్ లో నిర్వహించే యోచనలో ఐసీసీ ఉన్నట్టు సమాచారం అందుతోంది. ట్రోఫీపై ఇదే ప్రతిష్టంభన కొనసాగితే ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్ లోకి మార్చడం పెద్ద కష్టమేమీ కాదు. వన్డేలకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో మార్కెట్ లోకి సులభంగా చొచ్చుకెల్లేలా టీ20 ఫార్మాట్ లో ట్రోఫీని నిర్వహించడమే మేలని ఓ నివేదికలో వెల్లడైంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో జరగాల్సిన 50 ఓవర్ల ఈ వెంటన్ ను నిర్వహించే విధానంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఒక వేళ ఐసీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయ నష్టాలను, అంతర్జాతీయంగా అందే వెసులు బాట్లను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.


పీసీబీకి ఇదంత తేలికైన నిర్ణయమేమీ కాదని సీనియర్ విశ్లేషకులు అంటున్న మాట. ఇప్పటికే పాకిస్తాన్ ఎంపీఏపై సంతకం చేసింది. అంటే ఒక సభ్య దేశం ఐసీసీ ఈవెంట్ కోసం ఎంపీఏ పై సంతకం చేస్తే ఐసీసీ ఈవెంట్ ల నుంచి ఆర్జించిన కొంత బాగాన్ని పొందడానికి అర్హత సాధిస్తుంది. ముఖ్యంగా ఐసీసీ తన అన్ని ఈవెంట్లకు ఒప్పందంపై సంతకం చేసినప్పుడు ఐసీసీ సభ్యులందరు ఛాంపియన్స్ ట్రోఫీతో సహా వారి ఈవెంట్ లలో ఆడటానికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చినట్టు అవుతుంది. ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తే ఆ దేశం ఐసీసీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడంలో విఫలమవుతుంది.

Yuvraj Singh: 43వ పడిలోకి యువరాజ్.. డాషింగ్ ఆల్‌రౌండర్ లైఫ్‌లోని 7 డార్క్ సీక్రెట్స్


Updated Date - Dec 12 , 2024 | 04:17 PM