Maria Sharapova: టెన్నిస్ క్వీన్‌కు అరుదైన గౌరవం.. ‘హాల్ ఆఫ్ ఫేమ్’కు షరపోవా
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:13 PM
37 ఏళ్ల వయసులో మరియా షరపోవా టెన్నిస్ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. తాజాగా ఆమె ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది.
మాస్కో: మాజీ ప్రపంచ నంబర్ వన్, 5 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత మారియా షరపోవా అరుదైన ఘనత అందుకుంది. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ 2025కి షరపోవా ఎంపికైంది. షరపోవాతో పాటుగా అమెరికాకు చెందిన లెజెండరీ ట్విన్ బ్రదర్స్ బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ కూడా హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం సంపాదించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకను వచ్చే ఏడాది ఆగస్టు 23న జరపనున్నారు. టెన్నిస్ క్రీడలో విశేష సేవలు అందించిన వారిని దీనికి ఎంపిక చేస్తారు.
టెన్నిస్ కా క్వీన్..
37 ఏళ్ల వయసులో మరియా షరపోవా టెన్నిస్ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. 2005లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్‌ను సాధించిన మొదటి రష్యన్ మహిళగా నిలిచింది. అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ కెరీర్‌లో 5 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. వీటితో పాటు 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించింది. తన హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కినందుకుగాను షరపోవా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు కృతజ్ఞత తెలిపింది. ’ఈ గౌరవాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీలో ప్రతి ఒక్కరు నన్ను ఇంత ఎత్తుకు ఎదిగేలా చేశారు‘ అని ఆమె తెలిపింది.
ప్రైజ్ మనీతోె రికార్డు
షరపోవా తన ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. 2016లో మెల్డోనియం కోసం చేసిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలడంతో 15 నెలల పాటు సస్పెన్షన్ కు గురైంది. ఈ వివాదం ఉన్నప్పటికీ, ఆమె కెరీర్ లో సాధించిన విజయాలతో పాటు ఒక్క ప్రైజ్ మనీనే దాదాపు 40 మిలియన్లు కావడం విశేషం. 2020లో షరపోవా రిటైర్‌మెంట్ తీసుకుంది.
Shikhar Dhawan: శిఖర్ ధావన్ కు ఏమైంది.. ఆందోళనలో అభిమానులు
Updated Date - Oct 25 , 2024 | 03:33 PM