ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mohammad Shami: షమీ విధ్వంసం.. ఈ సారి బాల్‌తో కాదు.. బ్యాట్‌తో

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:10 PM

టీమిండియా జట్టులోకి రావాలన్న ఆరాటం షమీని ఊరికే ఉండనివ్వడం లేదు. ప్రస్తతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్, చత్తీస్ గఢ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ స్టార్ పేసర్ విధ్వంసం సృష్టించాడు. ఇటీవల రోహిత్ శర్మ మాట్లాడుతూ షమీ మూడో టెస్టులోకి వస్తాడని నమ్మకంగా చెప్పలేమన్నాడు. ఈ నేపథ్యంలో షమీ అద్భుత ప్రదర్శన టీమిండియా గెలుపు అవకాశాలపై కొత్త ఆశలు రేపుతున్నాయి.

Mohammad Shami

బెంగళూరు: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో షమీని తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా షమీ అద్భుతమైన ఫామ్ తో రెచ్చిపోయాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా చండీగఢ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ బెంగాల్ జట్టు టాప్ ఆర్డర్ కుదేలైంది. 114 పరుగులకు 8 వికెట్లను సమర్పించుకుంది. దీంతో షమీ రంగంలోకి దిగి తన అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లో 32 పరుగులు సాధించిన షమీ.. 188.24 స్ట్రైక్ రేటుతో మూడు బౌండరీలు, రెండు సిక్సులు కొట్టి బెంగాల్ జట్టును 159 స్కోరు వద్ద నిలబెట్టాడు.


రికార్డులు బద్దలు కొట్టిన షమీ..

బెంగాల్ జట్టును క్వార్టర్ ఫైనల్ లో నిలబేట్టేందుకు షమీ చేసిన ప్రదర్శనకు పలు రికార్డులు బద్దలయ్యాయి. ముస్తాక్ అలీ ట్రోఫీలోనే నంబర్ 10 స్థానంలో ఆడి హైయ్యెస్ట్ నాట్ ఔట్ స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు బద్దలుకొట్టాడు. నిజానికి 2019లో ఒడిశా రాజేష్ మొహంతీ(36) ఛత్తీస్ గఢ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డును అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో షమీ నిలిచాడు. షమీ తర్వాతి స్థానంలో సౌరాష్ట్ర ప్లేయర్ శౌర్య సనదియా మహారాష్ట్ర తరఫున 30 నాట్ ఔట్ స్కోరుతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టీ20ల్లోనూ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున 9 బంతుల్లో 21 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా షమీ నిలిచాడు. తన టీ20 కెరీర్ లో షమీకి ఇది రెండో రికార్డు. పొట్టి ఫార్మాట్ లో రెండంకెల స్కోరుతో షమీ మరో మెట్టు ఎక్కాడు. ఈ మ్యాచ్ కు ముందు షమీ పొట్టి ఫార్మాట్ లో రెండు సిక్సులు చేశాడు. దీన్ని ఈరోజు అందుకున్న రేర్ ఫీట్ తో సమం చేశాడు.

IND vs AUS: టీమిండియాకు కొత్త టెన్షన్.. ఆసిస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..


Updated Date - Dec 09 , 2024 | 03:18 PM