MS Dhoni: ఓటు వేసేందుకు భార్యతో వెళ్లిన ధోనీ.. ఇబ్బందిపెట్టిన అభిమానులు
ABN, Publish Date - Nov 13 , 2024 | 04:49 PM
ఓటు వేసేందుకు భార్యతో కలిసి వచ్చిన ధోనీని అభిమానులు బూత్ దగ్గరే అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ ధోనీ..
రాంచీ: భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రాంచీలో తన భార్య సాక్షితో కలిసి ఓటు వేసేందుకు వచ్చాడు. 2020లో అంతర్జాతీయ క్రెకెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మిస్టర్ కూల్ తన సొంత రాష్ట్రమైన ఝార్ఖండ్ లోనే జీవితాన్ని ఆనందిస్తున్నాడు. రిటైర్ అయినప్పటి నుండి తన స్వస్థలమైన రాంచీలో తన రిటైర్మెంట్ జీవితాన్ని ఆనందిస్తున్నారు.
అప్పటి నుండి ఈ భారత మాజీ కెప్టెన్ తన స్వగ్రామంలో సామాన్య జీవితం గడుపుతున్నాడు. అనేక సందర్భాల్లో ధోనీ బహిరంగంగా కనిపించిన వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. జార్ఖండ్‌లో మొదలైన ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ధోనీ ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. అందులో ధోనీ గట్టి భద్రత మధ్య పోలీంగ్ బూత్ లోకి ప్రవేశిస్తున్నట్టు కనిపించాడు. అప్పటికే అతడిని స్థానిక జనం, అభిమానులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో స్వల్ప ఇబ్బందికి గురైన ఈ క్రికెటర్ ను పోలీసులు భద్రతా సిబ్బంది కలిసి లోపలికి పంపించారు. ఈ సెలబ్రిటీ రాకతో కొంతసేపు బూత్ వద్ద హడావుడి వాతావరణం నెలకొంది.
రిటైర్మెంట్ తర్వాత ఒక్క ఐపీఎల్‌లో మాత్రమే బ్యాట్ పట్టి బరిలోకి దిగే మాహీ.. మిగతా ఏడాదంతా యాడ్స్, బిజినెస్ వ్యవహారాలు, ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉంటాడు. ఐపీఎల్, అడ్వర్టయిజ్‌మెంట్స్ ద్వారానే కాదు.. పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం, చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన ఆదాయాన్ని అతడు డబుల్ చేసుకుంటున్నాడు.
Viral Video: టెన్నిస్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న కుక్క.. ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Updated Date - Nov 13 , 2024 | 04:52 PM