ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SRH vs MI: టాస్ గెలిచిన ముంబై.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్

ABN, Publish Date - May 06 , 2024 | 07:16 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.

ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు సన్‌రైజర్స్ రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ ఇరుజట్ల మధ్య ఒక మ్యాచ్ జరగ్గా.. అందులో సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 277 పరుగులతో విధ్వంసం సృష్టించింది. ముంబై (246) కూడా లక్ష్యానికి దరిదాపుల్లోకి వచ్చింది కానీ ఛేధించలేకపోయింది. ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది.

కాగా.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కానీ.. ముంబై మాత్రం ఈ సీజన్‌లో అత్యంత పేలవంగా రాణిస్తోంది. 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. కేవలం మూడు విజయాలే నమోదు చేసింది. ప్లేఆఫ్స్ నుంచి అది నిష్క్రమించింది. ఇక ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 22 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిల్లో హైదరాబాద్ 10 గెలవగా, ముంబై 12 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉంది. వాంఖడే స్టేడియంలోనూ ముంబైదే ఆధిపత్యం. ఈ గ్రౌండ్‌లో ముంబై 5 సార్లు విజయం సాధిస్తే.. సన్‌రైజర్స్ రెండుసార్లు మాత్రమే గెలుపొందింది.


తుది జట్లు

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్, నమన్ ధీర్‌, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ది్క్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్‌ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్‌ అహ్మద్‌, మార్కో జాన్సన్‌, పాట్ కమిన్స్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, నటరాజన్.

Updated Date - May 06 , 2024 | 08:23 PM

Advertising
Advertising