Nitish Reddy: గంభీర్ ఇచ్చిన టిప్స్ నా ఆటను మార్చేశాయి: నితీశ్ రెడ్డి
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:45 PM
హార్దిక్ పాండ్యా మాత్రమే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా బెస్ట్ అనిపించుకుంటున్నాడు. రానున్న రోజుల్లో నితీశ్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా తయారుచేయడంపై సెలక్టర్లు ఫోకస్ పెట్టారు.
ముంబై: బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నితీశ్ రెడ్డి ఇప్పటికే తన బ్యాటింగ్ మాయాజాలంతో పలువురిని ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనూ అతడి పేరు వినిపిస్తోంది. బోయే ఆస్ట్రేలియా పర్యటనకు నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు చాలా అరుదుగా ఉంటారు. టీమిండియాకు నాణ్యమైన బ్యాటింగ్ దళం ఉన్నప్పటికీ వారు అత్యధిక వేగంతో బౌలింగ్ చేయలేరు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా మాత్రమే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా బెస్ట్ అనిపించుకుంటున్నాడు. రానున్న రోజుల్లో నితీశ్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా తయారుచేయడంపై సెలక్టర్లు ఫోకస్ పెట్టారు.
అలాంటి షాట్లు వద్దన్నాడు..
తాజాగా ఈ యువ బ్యాటర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన టిప్స్ తన కెరీర్ కు ఎంతో హెల్ప్ అయినట్టు అతడు తెలిపాడు. ‘‘కెరీర్ తొలి నాళ్లలో నన్నంతా దూకుడుగానే ఆడమని సలహా ఇచ్చేవారు. ఐపీఎల్ లో నా ఆటతీరు చూసిన వారంతా అదే స్ట్రైల్ ఫాలో అవ్వాలని చెప్పేవారు. కానీ, డ్రింక్స్ బ్రేక్ లో ఓసారి కోచ్ గౌతమ్ గంభీర్ నా దగ్గరకు వచ్చాడు. ప్యత్యర్థి జట్టు డీఆర్ ఎస్ కు వెళ్లగా అంపైర్ కాల్ ద్వారా నాటౌట్ గా ప్రకటించారు. నేను ఆడిన రివర్స్ స్వీప్ గురించి చెప్తూ నీకు మంచి స్ట్రేంత్ ఉంది. బంతిని ఈజీగా బౌండరీ దాటించగలవు. ఈ రకమైన వికెట్ల(ఢిల్లీ)పై రివర్స్ స్వీప్ ఆడాల్సిన అవసరం లేదు అని తెలిపాడు. కెరీర్‌లో ఈ దశలో గంభీర్ ఇచ్చిన సూచనలు ఎంతో బాగా పనిచేశాయి‘‘ అని నితీశ్ తెలిపాడు.
వేగం కన్నా పేస్ మిన్న..
కోచ్ చెప్పిన మాటలకు నేను రెట్టింపు ఉత్సాహంతో ఆడాను. తర్వాతి ఓవర్ లో స్పిన్నర్ వేసిన బంతులను మరింత బాగా ఆడగలిగాను. బౌలింగ్ విషయంలోనూ గంభీర్ తనకు విలువైన చిట్కాలు ఇచ్చినట్టు తెలిపాడు. వేగం కన్నా నిలకడగా ఆడటానికే తాను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తానని అతడు తెలిపాడు. ‘‘నిజం చెప్పాలంటే, నేను రెడ్ బాల్‌లో మరింత నిలకడగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. 130-135 బౌలింగ్ చేయడం మంచి పేస్ అని నేను భావిస్తున్నాను. 140-145 కంటే ఎక్కువ పేస్ బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ, నా నిలకడను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఇదే వేగాన్ని కొనసాగిస్తూనే మరింత స్థిరత్వాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కోచ్ కూడా నాతో ఇదే విషయాన్ని చెప్పారు. కాబట్టి నేను దానిపై ఎక్కువగా దృష్టి పెట్టాలనుకుంటున్నా’’ అని నితీశ్ తెలిపాడు.
IPL 2025: ఐపీఎల్ మెగా వేలం.. టాప్ 5 ఖరీదైన ఆటగాళ్లు వీరే
Updated Date - Oct 29 , 2024 | 03:45 PM