ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup: పాకిస్తాన్ ఇక ఇంటికేనా.. ఆ అద్భుతం జరిగితే తప్ప..

ABN, Publish Date - Jun 10 , 2024 | 02:57 PM

ఈసారి ఎలాగైనా వరల్డ్‌కప్ గెలవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆదిలోనే భంగపాటు ఎదురైంది. ఆర్మీ వద్ద ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని మరీ సిద్ధమైన ఆ జట్టు..

Pakistan Qualify Chances

ఈసారి ఎలాగైనా వరల్డ్‌కప్ (T20 World Cup) గెలవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ (Pakistan) జట్టు ఆదిలోనే భంగపాటు ఎదురైంది. ఆర్మీ వద్ద ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని మరీ సిద్ధమైన ఆ జట్టు.. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయాల్ని చవిచూసింది. తొలుత యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో పాక్ ఓడిపోగా.. ఆ తర్వాత జూన్ 9న భారత్‌తో (India vs Pakistan) జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో జెండా ఎత్తేసింది. దీంతో.. సూపర్-8లో క్వాలిఫై అయ్యే అవకాశాలు ఆ జట్టుకి సంక్లిష్టంగా మారాయి. అద్భుతం జరిగితే తప్ప.. ఆ జట్టు సూపర్-8లో చోటు దక్కించుకోవడం దాదాపు అసాధ్యమే!


ఆ రెండూ సాధించాలి

ఈ మెగా టోర్నీలో రెండు పరాజయాలతో పాక్ జట్టు పాయింట్ల టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఇది సూపర్-8లోకి చేరాలంటే.. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ రెండు మ్యాచ్‌లు కెనడా(Canada), ఐర్లాండ్‌తో (Ireland) ఉండబోతున్నాయి. ఆ రెండు జట్లపై పాకిస్తాన్ భారీ తేడాతో గెలుపొంది, తన రన్‌రేట్‌ని మెరుగుపరచుకోవాలి. అంతేకాదు.. యూఎస్ఏ (USA) జట్టు రూపంలో మరో మెలిక కూడా ఉంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆ జట్టు.. తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అలా కాకుండా యూఎస్ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా.. పాక్ జట్టు ఇక ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.


ఇంకో మెలిక

ఒకవేళ యూఎస్ఏ జట్టు రెండు మ్యాచ్‌లు ఓడిపోతే.. సూపర్-8లో పాకిస్తాన్ అర్హత సాధించాలా? లేదా? అనేది నెట్ రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూఎస్ఏ రన్‌రేట్ (+0.626) మెరుగ్గా ఉంది. కానీ.. పాక్ రన్‌రేట్ (-0.150) మాత్రం మైనస్‌లో ఉంది. ఈ లెక్కన.. పాక్ తప్పకుండా తన నెక్ట్స్ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది. రెండు జట్లపై భారీ తేడాతో విజయం సాధించక తప్పదు. మరి.. అది సాధ్యమవుతుందా? ఎలా చూసినా.. సూపర్-8లో చేరేందుకు పాకిస్తాన్‌కు చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయని చెప్పాలి. మరి.. విధి రాసిన రాత ఎలా ఉందో చూడాలి.

Read Latest Sports News and Telugu News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 02:57 PM

Advertising
Advertising