SRH vs PBKS: చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు... సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్
ABN, Publish Date - May 19 , 2024 | 05:22 PM
ఐపీఎల్ 2024లో చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 71 పరుగులతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
హైదరాబాద్: ఐపీఎల్ 2024లో చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 71 పరుగులతో రాణించడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 215 పరుగులుగా ఉంది.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో పాటు కొత్త కుర్రాడు అథర్వ తైడే కూడా రాణించాడు. 27 బంతుల్లోనే 46 పరుగులు బాదాడు. ఆ తర్వాత క్రీజులో వచ్చిన రూసో కూడా ఫర్వాలేదనిపించారు. 24 బంతుల్లో 49 పరుగులు కొట్టి ఔటయ్యాడు. ఇక కెప్టెన్ జితేశ్ శర్మ (32 నాటౌట్) చివరిలో మెరిపించాడు. అయితే శశాంక్ సింగ్ (2), అశ్‌తోశ్ శర్మ(2) నిరాశ పరిచారు. జితేశ్ శర్మతో పాటు శివమ్ సింగ్ (2) నాటౌట్‌గా నిలిచాడు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టీ నటరాజన్ 2 కీలకమైన వికెట్లు తీశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, నయా స్పిన్నర్ విజయకాంత్ వియాస్కాంత్‌కు చెరో వికెట్ పడింది. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.
Updated Date - May 19 , 2024 | 05:29 PM