ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dravid Son: రాహుల్ ద్రావిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. బీసీసీఐ టోర్నమెంట్‌కు ఎంపిక

ABN, Publish Date - Nov 10 , 2024 | 06:54 AM

అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీకి కర్ణాటక జట్టు ప్రకటించిన ఆటగాళ్ల ప్రాబబుల్స్ జాబితాలో ద్రావిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రావిడ్‌కు చోటుదక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రాణిస్తున్న క్రమంలో ఈ అవకాశం దక్కింది.

Rahul Dravid Son

టీమిండియా మాజీ దిగ్గజం, మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కొడుకులు ఇద్దరూ క్రికెట్‌లో దూసుకొస్తున్నారు. క్రమక్రమంగా ఎదుగుతున్నారు. ఈ క్రమంలో నిన్న (శనివారం) రాహుల్ ద్రావిడ్ కుటుంబానికి గుడ్‌న్యూస్ వచ్చింది. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీకి కర్ణాటక జట్టు ప్రకటించిన ఆటగాళ్ల ప్రాబబుల్స్ జాబితాలో ద్రావిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రావిడ్‌కు చోటుదక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రాణిస్తున్న క్రమంలో ఈ అవకాశం దక్కింది. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌కు మొత్తం 35 మంది ఆటగాళ్ల జాబితాను కర్ణాటక టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఇందులో ముగ్గురు వికెట్ కీపర్లు ఉండగా అందులో అన్వయ్ ద్రావిడ్ కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరి పేర్లు ఆదిత్య ఝా, జాయ్ జేమ్స్. కాగా ఈ టోర్నమెంట్ డిసెంబర్ 6 నుంచి మొదలుకానుంది.


కాగా అన్వయ్ ద్రావిడ్ గతేడాది ఇంటర్-జోన్ స్థాయిలో రాష్ట్ర అండర్-14 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల కేఎస్‌సీఏ అండర్-16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో తుమకూరు జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జోన్‌ తరపున 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీనిని బట్టి అన్వయ్ ఏవిధంగా రాణిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.


ఇక రాహుల్ ద్రావిడ్ పెద్ద కొడుడు, అన్వయ్‌ అన్నయ్య సమిత్ కూడా క్రికెట్‌లో దూసుకొస్తున్నాడు. ప్రస్తుతం వడోదర వేదికగా జరుగుతున్న కూచ్ బెహార్ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతున్నాడు. పేస్ ఆల్ రౌండర్ అయిన సమిత్ బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 141 బంతుల్లో ఎదుర్కొని 71 పరుగులు సాధించారు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. సమిత్ రాణించినప్పటికీ కర్ణాటక జట్టు ఇన్నింగ్స్, 212 పరుగుల తేడాతో బరోడా చేతిలో ఘోరంగా ఓడిపోయింది.


కాగా కర్ణాటక జట్టుకు రాష్ట్ర మాజీ ఆటగాళ్లు కునాల్ కపూర్ ప్రధాన కోచ్‌గా, ఆదిత్య సాగర్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. కాగా టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వైదొలగిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా చేరారు. ఈ మధ్యే రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించాడు. కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మలను రిటెయిన్ చేసుకున్నట్టు వెల్లడించాడు.

Updated Date - Nov 10 , 2024 | 07:01 AM