ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ravi Shastri: ‘ఒక్కసారైనా వరల్డ్‌కప్ గెలిచావా’ అంటూ రవిశాస్త్రి నిప్పులు.. ఎందుకంటే?

ABN, Publish Date - Jul 06 , 2024 | 06:25 PM

టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా జైత్రయాత్రపై ఎంతోమంది అక్కసు వెళ్లగక్కారు. క్రికెట్ ప్రపంచాన్ని బీసీసీఐ శాసిస్తోందని, ఐసీసీ నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా షెడ్యూల్ నిర్వహించిందని..

Ravi Shastri

టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) టీమిండియా జైత్రయాత్రపై ఎంతోమంది అక్కసు వెళ్లగక్కారు. క్రికెట్ ప్రపంచాన్ని బీసీసీఐ శాసిస్తోందని, ఐసీసీ నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా షెడ్యూల్ నిర్వహించిందని విషం చిమ్మారు. అలాంటి వారిలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ (Michael Waughan) కూడా ఉన్నాడు. టోర్నమెంట్ షెడ్యూల్‌ని ప్రస్తావిస్తూ.. నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించాడు. ఇందుకు రవిశాస్త్రి (Ravi Shastri) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘అసలు మైకేల్ వాన్ ఎప్పుడైనా వరల్డ్‌కప్ గెలిచాడా?’ అంటూ నిప్పులు చెరిగాడు.


మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలేంటి?

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తొలి సెమీఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ (South Africa vs Afghanistan) మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యచ్‌లో ఆఫ్ఘన్ ఓటమిపాలైంది. అప్పుడు మైకేల్ మాట్లాడుతూ.. ‘‘సూపర్-8లో భాగంగా కీలక మ్యాచ్ గెలిచి.. ఒక రోజు గ్యాప్‌తో ఆఫ్ఘన్ జట్టు సెమీఫైనల్ ఆడింది. అయితే.. వాళ్లు ట్రినిడాడ్‌కు వెళ్లాల్సిన ఫ్లైట్ 4 గంటలు ఆలస్యమైంది. దాంతో వాళ్లకు ప్రాక్టీస్ చేసే సమయం దొరకలేదు. ఇలా చేసి ఆఫ్ఘన్ ప్లేయర్లను అగౌరవపరిచింది’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. భారత్‌కి అనుకూలంగా ఐసీసీ షెడ్యూలో నిర్వహించిందని ఆరోపణలు చేశాడు.


రవిశాస్త్రి కౌంటర్

మేకేల్ వ్యాఖ్యలపై రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘మైకేల్ వాన్‌ ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. అతని మాటలను భారత్‌లో ఏ ఒక్కరూ పట్టించుకోరు. ముందుగా.. భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై అతను దృష్టిపెడితే బాగుంటుంది. భారత్‌‌కు ఇప్పుడు ట్రోఫీలు సాధించడం సర్వసాధారణమైంది. అవును.. ఇంగ్లండ్ కూడా రెండుసార్లు ట్రోఫీ గెలిచింది. కానీ.. భారత్ వద్ద నాలుగున్నాయి. నాకు తెలిసి.. మైకేల్ వాన్ ఒక్క వరల్డ్‌కప్ కూడా సాధించలేదు. అతను నా కొలీగ్. అతని వ్యాఖ్యలకు ఇదే నా సమాధానం’’ అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 06:25 PM

Advertising
Advertising
<