ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rinku Singh: ఆ కారణం వల్లే చోటు దక్కలేదు.. రింకూ సింగ్ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - May 29 , 2024 | 08:48 PM

టీ20 వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో తనని ఎంపిక చేయకపోవడంపై యువ సంచలనం రింకూ సింగ్ తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు దక్కకపోవడం..

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం ప్రకటించిన భారత జట్టులో (Team India Squad) తనని ఎంపిక చేయకపోవడంపై యువ సంచలనం రింకూ సింగ్ (Rinku Singh) తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు దక్కకపోవడం బాధాకరమైన విషయమేనని చెప్పిన అతను.. తనని ఎంపిక చేయకపోవడం వెనుక గల కారణాన్ని బయటపెట్టాడు. టీమ్ కాంబినేషన్ వల్లే తాను సెలక్ట్ కాలేకపోయానని తెలిపాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో అతను ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


Read Also: టీమిండియా హెడ్ కోచ్ పదవికి ధోనీ అనర్హుడు.. ఎందుకో తెలుసా?

‘‘అవును.. మంచి ప్రదర్శన కనబరిచినా జట్టులో ఎంపిక కాకపోతే, తప్పకుండా ఎవరికైనా బాధ కలుగుతుంది. టీమ్ కాంబినేషన్ వల్లే నాకు భారత్ స్క్వాడ్‌లో చోటు దక్కలేదని నేను భావిస్తున్నాను. ఏదేమైనా.. మన చేతుల్లో లేని అంశాల గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. జట్టు ప్రకటన వచ్చిన మొదట్లో నేను కాస్త బాధపడిన మాట వాస్తవమే గానీ, ఏం జరిగినా మన మంచికే అని అనుకున్నాను. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాకు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. కష్టపడి పని చేయమని మాత్రమే చెప్పాడు. కంగారు పడాల్సిన అవసరం లేదని, మరో రెండేళ్లలో వరల్డ్‌కప్ వస్తుందని రోహిత్ చెప్పాడు’’ అని రింకూ సింగ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Read Also: జూన్ నెలలో ఈ తేదీలు ఎంతో ముఖ్యమైనవి.. అవేంటంటే?

ఇదే సమయంలో.. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు ఛాంపియన్‌గా నిలవడంపై కూడా రింకూ సింగ్ స్పందించాడు. తమ మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వల్లే.. తమ జట్టు ఈ టైటిల్‌ని సొంతం చేసుకోగలిగిందని అన్నాడు. ఈ విజయం గురించి చెప్పడానికి తనకు మాటలు రావడం లేదని, గత ఏడేళ్ల నుంచి దీని కోసమే తాను ఎదురు చూస్తున్నానని, ఎట్టకేలకు కప్ కొట్టాలన్న తన కల ఇన్నాళ్ల తర్వాత నెరవేరిందని చెప్పాడు. ఈ క్రెడిట్‌ మొత్తం గంభీర్‌కే దక్కుతుందని పేర్కొన్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 29 , 2024 | 08:49 PM

Advertising
Advertising