ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rishabh Pant: ఆస్ట్రేలియా లెజెండ్‌తో పంత్ దాగుడుమూతలు.. రియాక్షన్ వైరల్

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:47 PM

ఆసిస్ తో మ్యాచ్ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు లెజెండ్ ను ఆటపట్టించిన పంత్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ తర్వాత వీరిద్దరి రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Rishabh Pant

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ షేర్ చేసిన ఓ వీడియో క్రికెట్ అభిమానుల మనసు దోచింది. ఆసిస్ జట్టుతో మూడో టెస్టు ముంగిట భారత్ మ్యాచ్ సన్నాహకాల్లో మునిగిపోయింది. అయితే, పంత్ మాత్రం ఆస్ట్రేలియా లెజెండ్ వికెట్ కీపర్ గిల్ క్రైస్ట్ ను ఆటపట్టిస్తున్న వీడియోను నెట్టింట షేర్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఈ గిల్ క్రైస్ట్ స్టార్ స్పోర్ట్స్ బ్రోడ్ కాస్ట్ కి ఎక్స్ పర్ట్ పానెల్ సభ్యుడిగా ఉన్నాడు. అతడు మైదానంలో నడుస్తున్న సమయంలో వెనకనుంచి చప్పుడు చేయకుండా వచ్చిన పంత్ చటుక్కున గిల్ ను వెనక నుంచి పట్టుకున్నాడు. తన రెండు చేతులతో అతడి కళ్లు మూసి కాసేపు ఆటపట్టించాడు. ముందుగా కంగారు పడి షాకైన గిల్ ఆ తర్వాత వెనకాల చేతులు వేసి పంత్ ను గుర్తించాడు. ఆ తర్వాత వీరిద్దరి ఆత్మీయ ఆలింగనం చూపరులను ఆకట్టుకుంటోంది. ఇది నిజంగా తనకు సర్ ప్రైజింగ్ గా అనిపించిందని గిల్ తెలిపాడు. కామెంటేటర్లను సైతం పంత్ చర్య ఆశ్చర్యానికి గురిచేసింది.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టులో స్కిప్పర్ పాట్ కమిన్స్ ముందు చూపు ఆసిస్ జట్టును ఆధిక్యంలో నిలిపింది. అతడే 14 ఓవర్లలో 5 వికెట్లకు 57 పరుగులు సాధించాడు. ఇది ఆతిథ్య జట్టుకు ముందునుంచే జోష్ నిచ్చింది. ఫలితంగా ఈ ఐద్యు మ్యాచ్ ల సిరీస్ ను కంగారు జట్టు 1-1తో సమం చేసింది. 128/5 స్కోరుతో ప్రారంభించిన టీమిండియా కేవలం 47 పరుగులు చేసి కుప్పకూలింది. దీంతో టీమిండియా ఆశలు ఆవిరవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇక ఈ మ్యాచ్ లో రిషభ్ పంత్ ను ఆసిస్ జట్టు 28 స్కోరుకే పరిమితం చేసింది. నితీష్ కుమార్ రెడ్డి స్కోరు టీమిండియాను ఓ మోస్తరు ర్యాంక్ వద్ద నిలబెట్టగలిగింది.

Mohammad Shami: షమీ విధ్వంసం.. ఈ సారి బాల్‌తో కాదు.. బ్యాట్‌తో


Updated Date - Dec 09 , 2024 | 03:58 PM