ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rishabh pant: కివీస్ తో రెండో టెస్టు.. టెన్షన్ పెడుతున్న రిషభ్ పంత్

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:28 PM

టీమిండియా ఈ మ్యాచ్ లో ఓటమిని చూసినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్, పంత్ భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చి 99 పరుగులతో మంచి స్కోర్ ని అందించాడు.

Rishabh pant

ముంబై: కివీస్ తో తొలి టెస్టులో ఘోర పరాభవం చూసిన టీమిండియా రెండో టెస్టుకు సన్నద్ధమవుతోంది. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం టీమిండియా అభిమానులను టెన్షన్ పెడుతున్నాడు. ఇప్పటికే తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో గాయపడిన పంత్ వికెట్లు తీయడంలో ఫెయిలయ్యాడు. కానీ, రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చి 99 పరుగులతో మంచి స్కోర్ ని అందించాడు.


వారి భాగస్వామ్యం నిలబెట్టింది..

టీమిండియా ఈ మ్యాచ్ లో ఓటమిని చూసినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్, పంత్ భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. కానీ, పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని మొన్నటి ఆటలో స్పష్టమవుతోంది. గురువారం జరగనున్న రెండో టెస్టులో పంత్ ఆడతాడా లేదా అనే విషయంపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. పంత్ ను పిలవాలనే నిర్ణయాన్ని సెలక్టర్లు మేనేజ్మెంట్ కే వదిలేశారని తెలుస్తోంది.


పంత్ స్థానంలో ఎవరు?

ఒకవేళ పంత్ రెండో టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో ధృవ్ జురెల్ కు మరోసారి చాన్స్ దక్కేలా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ టైంలో మొదటి సారి ఈ ఆటగాడు టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసి మంచి మార్కులే వేయించుకున్నాడు. తర్వాత పంత్ తిరిగి టీం లో చేరడంతో అతడి అవసరం లేకుండా పోయింది. కివీస్ తో తొలి టెస్టులో వికెట్ కీపింగ్ తో అదరగొట్టాడు. రానున్న ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో సెలక్టర్లు పంత్ విషయంలో రిస్క్ తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అదే జరిగితే మరోసారి పంత్ స్థానంలో ధృవ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక న్యూజిలాండ్ తో రెండో టెస్టు పుణె వేదికగా అక్టోబర్ 24(గురువారం) జరగబోతోంది.

KL Rahul: ఆ ఫొటోలో అంత మీనింగ్ ఉందా?

Updated Date - Oct 21 , 2024 | 01:28 PM