ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: ఆ పిచ్‌పై రోహిత్ మట్టి తినడం వెనుక ఇంత కథ దాగి ఉందా..?

ABN, Publish Date - Jul 02 , 2024 | 01:01 PM

టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ బార్బడోస్ పిచ్‌పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత టైటిల్ నెగ్గామన్న ఆనందంలో.. రోహిత్ అలా మట్టి తిన్నాడు. ఇందుకు..

Rohit Sharma Grass Eating Celebrations

టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బార్బడోస్ (Barbados) పిచ్‌పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత టైటిల్ నెగ్గామన్న ఆనందంలో.. రోహిత్ అలా మట్టి తిన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో ఇప్పటికే వైరల్ అయ్యింది. అయితే.. తానలా మట్టి తినడానికి గల కారణం ఏంటనేది ఆ సమయంలో అతను వెల్లడించలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆ మిస్టరీకి తెరదించుతూ.. దాని వెనుక గల కారణాన్ని వెల్లడించాడు. ఆ పిచ్ తనకెంతో ప్రత్యేకమైందని, దాన్ని తనలో భాగం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మట్టిని తిన్నానని క్లారిటీ ఇచ్చాడు.


‘‘ఆ బార్బడోస్ పిచ్‌పై మేము మా కలని సాకారం చేసుకున్నాం. టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని సొంతం చేసుకున్నాం. దాంతో ఆ పిచ్ నాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. దానిని నేను జీవితాంతం గుర్తుంచుకుంటా. ఆ పిచ్‌లో నాలో భాగం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే.. ఆ మట్టిని నోట్లో వేసుకున్నా. ఆ క్షణాలు ఎంతో ప్రత్యేకమైనవి’’ అని రోహిత్ శర్మ వివరించాడు. అదేమీ స్క్రిప్టెక్ కాదని, ఆ క్షణాన్ని తాను అనుభూతి చెందానని క్లారిటీ ఇచ్చాడు. ఆ పిచ్ తమ కలను సాకారం చేసింది కాబట్టే, అందులో కొంత భాగాన్ని తనలో విలీనం చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. తాము వరల్డ్‌కప్ గెలిచామన్న ఫీలింగ్ నమ్మశక్యంగా లేదని, ఇప్పటివరకూ అదంతా ఓ కలలాగే అనిపిస్తోందని చెప్పాడు.


వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం తామంతా కలిసి తెల్లవారుజాము వరకు సంబరాలు చేసుకున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. వరల్డ్ కప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైందని, ఈ విజయాన్ని తాము ఇంకా పూర్తిగా ఆస్వాదించలేదని అన్నాడు. ఇలాంటి రోజు తమ భారత జట్టు ఎంతో కష్టపడిందని చెప్పాడు. ఎట్టకేలకు తాము పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని వెల్లడించాడు. కాగా.. భారత జట్టు ఇంకా బార్బడోస్‌లోనే ఉంది. భయంకరమైన హరికేన్ కారణంగా.. అక్కడ విమాన సేవలు రద్దు కావడం, అధికారులు కర్ఫ్యూ విధించడంతో, ఆటగాళ్లంందరూ తమతమ హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. పరిస్థితులు సద్దుమణిగాక భారత్‌కి తిరిగి రానున్నారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 01:01 PM

Advertising
Advertising