ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RCB vs DC: మెరిసిన ఆర్సీబీ బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

ABN, Publish Date - May 12 , 2024 | 09:24 PM

బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ..

బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (52) అర్థశతకంతో అదరగొట్టడంతో పాటు విల్ జాక్స్ (41), గ్రీన్ (32), విరాట్ కోహ్లీ (27) మెరుగ్గా రాణించడంతో.. ప్రత్యర్థి జట్టుకి ఆర్సీబీ 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి మొదట్లోనే రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. 23 పరుగుల వద్ద కెప్టెన్ ఫాఫ్ ఔట్ అవ్వగా, 32 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్ అయ్యాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే కోహ్లీ దూకుడుగా ఆడటం.. మూడు సిక్సులతో పాటు ఒక ఫోర్ బాదడం చూసి.. ఈరోజు కూడా కోహ్లీ చితక్కొట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. దురదృష్టవశాత్తూ అతను ఇషాంత్ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్, విల్ జాక్స్ కలిసి.. డీసీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఓవైపు ఆచితూచి ఆడుతూ.. మరోవైపు బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఎడాపెడా షాట్లతో పరుగుల వర్షం కురిపించారు. మూడో వికెట్‌కి వీళ్లిద్దరు 88 పపరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే రజత్ అర్థశతకం చేశాడు.


రజత్, జాక్స్ క్రీజులో ఉన్నంతవరకూ బెంగళూరు స్కోరు పరుగులు పెట్టింది. ఇది చూసి.. ఆర్సీబీ 220కి పైగా పరుగులు చేయడం తథ్యమని అందరూ భావించారు. కానీ.. వాళ్లిద్దరు ఎప్పుడైతే ఔట్ అయ్యారో, అప్పటి నుంచి ఆర్సీబీ స్కోరు నెమ్మదించింది. వాళ్ల తర్వాత వచ్చిన వారిలో గ్రీన్ మినహాయించి.. మిగతా వాళ్లెవరూ పెద్దగా రాణించలేకపోయారు. మైదానంలో అడుగుపెట్టినట్టే పెట్టి.. వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. 200+ మార్క్ దాటుతుందనుకున్న ఆర్సీబీ 187 పరుగులకే పరిమితం అయ్యింది. తన ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలంటే, ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మరి.. 187 పరుగుల్ని ఆర్సీబీ బౌలర్లు డిఫెండ్ చేయగలరా? లేదా? అనేది వేచి చూడాలి.

Updated Date - May 12 , 2024 | 09:24 PM

Advertising
Advertising