ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: రాణించిన సాయి సుదర్శన్.. ఆర్సీబీకి భారీ టార్గెట్ నిర్దేశించిన గుజరాత్

ABN, Publish Date - Apr 28 , 2024 | 05:36 PM

అహ్మదాబాద్: కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాటర్లు రాణించారు. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

అహ్మదాబాద్: కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాటర్లు రాణించారు. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ విజయ లక్ష్యంగా 201 పరుగులుగా ఉంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుతంగా రాణించాడు. 45 పరుగులకే గుజరాత్ 2 కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో 84 పరుగులతో అదరగొట్టాడు. మొత్తం 49 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.


మరో యువ బ్యాట్స్‌మెన్ షారుఖ్ ఖాన్ కూడా ఫర్వాలేదనిపించాడు. 30 బంతుల్లో 58 పరుగులు బాదాడు. ఇందులో ఏకంగా 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉండడం విశేషం. చివరిలో డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 26 పరుగులు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా 5, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 16 చొప్పున పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీశారు.

Updated Date - Apr 28 , 2024 | 05:50 PM

Advertising
Advertising