ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: టీమిండియాకు ఓపెనర్ ఎవరు.. రోహిత్ త్యాగం జట్టుకు లాభమేనా..

ABN, Publish Date - Dec 10 , 2024 | 05:52 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘోర ఓటమిని చూసిన తర్వాత జట్టులో రోహిత్ స్థానంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం మిడిలార్డర్ లో ఆడుతున్న రోహిత్.. యశస్వితో పాటు ఓపెనర్ గా ఆడాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.. కానీ..

Kl Rahul, Rohit Sharma

ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు ముగిసినప్పటికీ ఈ మ్యాచ్ తాలూకు గాయాలు టీమిండియాను ఇంకా వెంటాడుతున్నాయి. రెండు రోజుల పాటు సాగిన డే, నైట్ టెస్ట్ లో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు బ్రిస్బేన్ టెస్టు కోసం చెమటోడ్చుతున్నారు. అయితే, మూడో టెస్టులో టీమిండియాకు ఓపెనర్ గా రోహిత్ శర్మ వస్తాడా లేదా అనే విషయం ఇప్పుడ హాట్ టాపిక్ గా మారింది. కానీ, భారత్ మాత్రం కెప్టెన్ విషయంలో ఎలాంటి మార్పులను చేసేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.


పింక్ బాల్ టెస్టులో రోహిత్ నంబర్ 6 స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తో కలిసి ఓపెనింగ్ స్థానాల్లో ఆడారు. ఇక ఈ టెస్టులో రాహుల్, రోహిత్ ఇద్దరూ పరుగులు తీయడంలో దారుణంగా విఫలమయ్యారు. హిట్ మ్యాన్ తన ఓపెనింగ్ స్పాట్ ను తిరిగి పొందాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, మిడిల్ ఆర్డర్ లో కనీసం ఒక్క ఆటైనా ఆడేందుకు రోహిత్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఆడిలైడ్ లో జరిగిన భారత నెట్ సెషన్ తర్వాత పింక్ బాల్ టెస్ట్ నుంచి టీమ్ ఇండియా ఆర్డర్ లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. నెట్స్ లో విరాట్ కోహ్లీ, తన బ్యాక్ ఫుట్ తో పాటు అతని ఫ్రంట్ ఫూట్ తోనూ సాధన చేస్తున్నాడు.


రాహుల్ కన్నా రోహిత్ మిన్న..

ఇదే విషయంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం స్పందించాడు. రోహిత్ తిరిగి తన ఓపెనింగ్ స్థానంలోనే ఆడాలి. రాహుల్ నిజానికి ఓపెనింగ్ స్థానాన్ని ఎందుకు త్యాగం చేశాడు. అతడు పెర్త్ టెస్టుకు అందుబాటులో లేకపోవడం వల్లనే కదా.. అప్పుడు రాహుల్ అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి రోహిత్ ఓపెనర్ గా ఆడాలి. రాహుల్ రెండో టస్టులో రాణించలేకపోయాడు. అతడికి మరో చాన్స్ ఇచ్చి చూడటం కన్నా రోహిత్ ను నమ్ముకోవడమే బెటర్ అంటూ ఈ మాజీ క్రికెటర్ కామెంట్స్ చేశాడు.

Virat Kohli: గాయపడిన సింహం.. కోహ్లీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..


Updated Date - Dec 10 , 2024 | 05:52 PM