ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Surya Catch Row: క్యాచ్ వివాదం.. బౌండరీ లైన్‌ని వెనక్కు నెట్టారా.. అసలు నిజం ఇది!

ABN, Publish Date - Jul 02 , 2024 | 01:37 PM

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ పట్టిన సెన్సేషన్ క్యాచ్‌పై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ దీనిపై నానా రాద్ధాంతం..

Suryakumar Catch Controversy

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ (Suryakumar Yadav) పట్టిన సెన్సేషన్ క్యాచ్‌పై తీవ్ర వివాదం (Surya Catch Controversy) నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ దీనిపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. నిజానికి అది సిక్స్ అని, కానీ బౌండరీ లైన్‌ను (Boundary Line) వెనక్కు నెట్టారని, ఇందుకు సంబంధించిన మార్క్‌ని మైదానంలో గమనించవచ్చని చెప్తున్నారు. ఇది ముమ్మాటికీ మోసమంటూ ఆరోపణలు చేస్తున్నారు. భారత్‌కు ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ టైంలో ఆ బౌండరీ లైన్‌ని వెనక్కు జరిపారని విమర్శలు చేస్తున్నారు.


అసలు కథ ఇది!

తాజాగా ఈ విమర్శలను తిప్పికొడుతూ.. ఓ క్రికెట్ విశ్లేషకుడు అసలు నిజం బయటపెట్టాడు. ఆ బౌండరీ లైన్‌ను ఏమాత్రం వెనక్కు జరపలేదని, మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు నుంచే అది అక్కడే ఉందని క్లారిటీ ఇచ్చాడు. పిచ్ మారినప్పుడు బౌండరీ లైన్‌ను సర్దుబాటు చేస్తున్నారని.. క్రికెట్‌లో ఇది సర్వసాధారణమేనని తెలిపాడు. ఇలా సర్దుబాటు చేసినప్పుడు.. గత ప్లేస్‌మెంట్ కారణంగా నేలపై తెల్లటి గుర్తులు ఏర్పడటం సహజమేనని వివరించాడు. కేవలం సూర్య క్యాచ్ పట్టిన ప్రాంతంలోనే కాదు, గ్రౌండ్ చుట్టూ బౌండరీ లైన్‌ని అడ్జస్ట్ చేయడం జరిగిందని, ఇతర ప్రాంతాల్లోనూ తెల్లటి గుర్తుల్ని గుర్తించవచ్చని పేర్కొన్నాడు. కాబట్టి.. దీనిపై అనవసరమైన రాద్ధాంతం సృష్టించవద్దని కోరాడు.


షాన్ పొల్లాక్ రియాక్షన్

సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ షాన్ పొల్లాక్ (Shaun Pollock) సైతం ఈ క్యాచ్‌ని సమర్థించాడు. అందులో ఎలాంటి వివాదం లేదని, సూర్య సరైన క్యాచే పట్టాడని తెలిపాడు. ఆటలో భాగంగానే బౌండరీ లైన్‌ని వెనక్కు జరిపారే తప్ప.. దాంతో సూర్యకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. అతను ఆ క్యూషన్‌ని తాకకుండానే అద్భుతమైన క్యాచ్ పట్టాడని.. అతని ప్రతిభను మెచ్చుకోవాల్సిందేనని కొనియాడాడు. మరోవైపు.. ఇది దేవుడి ప్లాన్ అని, దేశం కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్న సమయంలో ఆ క్యాచ్ వచ్చిందని, ఆ మూమెంట్‌లో తాను అక్కడ ఉన్నందుకు కృతజ్ఞుడినని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 01:37 PM

Advertising
Advertising