ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shoaib Akhtar: సూపర్-8లో చేరే అర్హత పాకిస్థాన్‌కు ఉందా.. షోయబ్ అఖ్తర్ విమర్శనాస్త్రాలు

ABN, Publish Date - Jun 10 , 2024 | 09:15 PM

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయం చవిచూడటంతో.. ఆ దేశాభిమానులు, మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Shoaib Akhtar Fires On Pakistan

టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ (Pakistan) ఘోర పరాజయం చవిచూడటంతో.. ఆ దేశాభిమానులు, మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్మీ వద్ద ప్రత్యేక ట్రైనింగ్ తీసుకొని మరీ బరిలోకి దిగి.. ఇంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారేంటని తీవ్రంగా మండిపడుతున్నారు. గల్లీ క్రికెట్ ప్లేయర్ల కన్నా దారుణంగా ఆడుతున్నారంటూ సెటైర్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో లేటెస్ట్‌గా పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ కూడా చేరిపోయాడు. అసలు సూపర్-8లో చేరే అర్హత పాక్ జట్టుకి ఉందా? అంటూ నిట్టూర్చాడు.


‘‘పాకిస్తాన్ ఓటమితో (పాక్) అభిమానులందరూ నిరాశలో ఉన్నారన్న సంగతి తెలుసు. ఈ పరాజయం ఏమాత్రం జీర్ణించుకోలేనిది. యావత్ దేశం మానసికంగా కుంగిపోయింది. ఆటలో వ్యక్తిగత లక్ష్యాలు ఉండకూడదని నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను. ఒకరికొకరు సహకారం అందించుకుంటూ.. దేశం కోసం మ్యాచ్ ఆడాలి. ఎంతో పట్టుదలతో ప్రదర్శన కనబరిచి, గేమ్‌లో గెలుపొందాలి. వ్యక్తిగత మైల్‌స్టోన్స్ గురించి అస్సలు పట్టించుకోకూడదు. కానీ పాక్ ఆటగాళ్లు చెత్త ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచారు. అసలు సూపర్-8లో చేరే అర్హత పాక్ జట్టుకి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఆ దేవుడెరుగు. ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నా?’’ అంటూ సోషల్ మీడియా ఖాతాల్లో తాను షేర్ చేసిన వీడియోలో షోయబ్ చెప్పుకొచ్చాడు.


ఇదే సమయంలో మరో పాక్ మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ సైతం.. ఇమాద్ వసీమ్‌పై నిప్పులు చెరిగాడు. అత్యంత కీలకమైన సమయంలో అతను 23 బంతులు ఎదుర్కొని, కేవలం 15 పరుగులు చేశాడంటూ మండిపడ్డాడు. దూకుడుగా ఆడాల్సిన టైంలో నెమ్మదిగా ఆడి బంతులను వృథా చేశాడని.. దీంతో ఒత్తిడి పెరిగి లక్ష్య ఛేదన కష్టమైందని అభిప్రాయపడ్డాడు. అటు.. షాహిద్ ఆఫ్రీది సైతం కెప్టెన్ బాబార్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం కనిపించడం లేదని, అతనితో ఆటగాళ్లకు సమస్యలు ఉన్నట్లు అనిపిస్తోందని కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు.. ఈ వరల్డ్‌కప్ ముగిశాక మొత్తం వివరాలు బయటపెడతానని బాంబ్ పేల్చాడు.

Read Latest Sports News and Telugu News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 10:04 PM

Advertising
Advertising