ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Babar Azam: బాబర్ ఆజంకి ఘోర అవమానం.. చివరికి నేపాల్ జట్టు కూడా..

ABN, Publish Date - Jul 02 , 2024 | 04:31 PM

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. ఇప్పటికీ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. అభిమానుల దగ్గర నుంచి మాజీ ప్లేయర్ల దాకా.. ప్రతిఒక్కరు వారిని ఏకిపారేస్తున్నారు.

Babar Azam

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నీ నుంచి పాకిస్తాన్ (Pakistan) జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. ఇప్పటికీ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. అభిమానుల దగ్గర నుంచి మాజీ ప్లేయర్ల దాకా.. ప్రతిఒక్కరు వారిని ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా.. కెప్టెన్ బాబర్ ఆజంపై (Babar Azam) తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సారథిగానే కాదు, ప్లేయర్‌గానూ అతను పూర్తిగా విఫలమయ్యాడంటూ తిట్టిపోస్తున్నారు.


తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) సైతం బాబర్‌పై నిప్పులు చెరిగాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ దుర్భర ప్రదర్శనకు అతడే కారణమని మండిపడ్డాడు. పాక్ అత్యుత్తమ ఆటగాడైన బాబర్.. ఏ అంతర్జాతీయ జట్టులోనూ ఫిట్ అవ్వలేడని, చివరికి నేపాల్ జట్టు సైతం అతడ్ని ఎంపిక చేయదని అవమానకర వ్యాఖ్యలు చేశాడు. ఓ టాక్ షోలో భాగంగా షోయబ్ ఇలా ధ్వజమెత్తాడు. ‘‘పాకిస్తాన్ జట్టులో అత్యుత్తమ ఆటగాడు ఎవరు? బాబర్ ఆజం. మరి.. అతను భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లలో ప్లేయింగ్ XIలో ఫిట్ అవ్వగలడా? అందుకు సమాధానం.. నో’’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరికి నేపాల్ సైతం బాబర్‌ని ఎంపిక చేయదని బాంబ్ పేల్చాడు.


పాక్ నిష్క్రమణ

ఇదిలావుండగా.. ఈసారి ఎలాగైనా టీ20 వరల్డ్‌కప్ గెలవాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ ఆటగాళ్లు ఆర్మీ వద్ద ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. టోర్నీకి ముందు వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్‌గా కూడా కనిపించారు. తీరా మైదానంలో అడుగుపెట్టాక తుస్సుమన్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం చవిచూడటం, అమెరికా జట్టు సమర్థవంతంగా రాణించడంతో.. పాక్ జట్టు గ్రూప్ దశలోనే తట్టాబుట్టా సర్దేయాల్సి వచ్చింది. ఐర్లాండ్‌పై మాత్రమే విజయం సాధించారు. ఈ టోర్నీలో బాబర్ ఆజం మొత్తం మూడు మ్యాచ్‌ల్లో.. 44.66 సగటున 101.66 స్ట్రైక్‌రేట్‌తో 122 పరుగులు చేశాడు. పాక్ జట్టు గ్రూప్ దశలోనే ఇలా నిష్క్రమించడం టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే తొలిసారి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 04:31 PM

Advertising
Advertising