ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs PM XI: గిల్ రాకతో ఆ ఇద్దరు అవుట్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండేది వీరే..

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:29 PM

తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టును సైతం ఏదోరకంగా ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రెడిక్షన్ చర్చనీయాంశంగా మారింది. రోహిత్‌, గిల్ రాకతో..

Team India

ముంబై: డిసెంబరు 6న అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే పింక్-బాల్ టెస్టు కోసం టీమ్ ప్లేయింగ్ ఎలెవన్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో భారత్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అడిలైడ్ ఓవల్‌లో జరిగే ఆట కోసం కెప్టెన్ రోహిత్ శర్మర, స్టార్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌లను తిరిగి జట్టులోకి తీసుకోవడం ఖాయమని ఇప్పటికే అభిమానులు ఫిక్సయ్యారు. రోహిత్ తన రెండవ బిడ్డ పుట్టిన కారణంగా మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఇక గిల్ సైతం.. వాకా గ్రౌండ్‌లో భారత్ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బొటనవేలికి గాయంతో తొలి టెస్టుకు దూరంగా ఉన్నాడు.


ఇదిలా ఉంటే తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టును సైతం ఏదోరకంగా ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రెడిక్షన్ చర్చనీయాంశంగా మారింది. రోహిత్‌, గిల్ రాకతో దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్‌ జురెల్ ప్లేయింగ్ ఎలెవన్‌ నుంచి బయటకివస్తారని గవాస్కర్ తెలిపాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ కూడా మార్పులు జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

వారిద్దరూ బయటికెళ్తారు..

‘‘జట్టులో కచ్చితంగా కొన్ని మార్పులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అందులో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తిరిగి జట్టులో చేరడం ఒకటి. ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు ఉండే చాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్, మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ వస్తారు. పడిక్కల్, జురెల్ తుది జట్టులో ఉండరు. రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. మూడో మార్పు ఏంటంటే వాషింగ్టన్ సుందర్‌ ప్లేస్‌లో రవీంద్ర జడేజా తుది జట్టులోకి వస్తాడు’’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.


గవాస్కర్ అంచనా వేసిన తుది జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్‌ కీపర్‌), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్‌ రెడ్డి, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.

IPL Auction: ఐపీఎల్‌‌లో అమ్ముడుపోలేదు.. వదిలేసిన జట్లకు అలా బుద్ధిచెప్పారు..


Updated Date - Dec 01 , 2024 | 12:36 PM