ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KKR vs SRH-Qualifier 1: తేలిపోయిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. కోల్‌కతా ముందు ఈజీ టార్గెట్

ABN, Publish Date - May 21 , 2024 | 09:20 PM

ఐపీఎల్ 2024లో ఫైనల్‌కు చేర్చే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయ్యారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

అహ్మదాబాద్: ఐపీఎల్ 2024లో ఫైనల్‌కు చేర్చే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయ్యారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యారు.


హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. రాహుల్ త్రిపాఠి 35 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఇక బ్యాటర్ల విషయానికి వస్తే హెన్రిచ్ క్లాసెన్ 21 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించాడు. మిగతా వారిలో ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (3), నితీశ్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0), అబ్దుల్ సమద్ (16), సన్వీర్ సింగ్ (0), భువనేశ్వర్ కుమార్ (0), ప్యాట్ కమ్మిన్స్ (30), విజయకాంత్ (7 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.


కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ అత్యంత కీలకమైన మూడు వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ని చావుదెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌ రెండో బంతికే ట్రావిస్ హెడ్‌ని క్లీన్ చేశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్‌లను వరుస బంతులకు ఔట్ చేశాడు. మిగతా కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్ర్యూ రస్సెల్ తలో వికెట్ తీశారు. ఒక వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.

Updated Date - May 21 , 2024 | 09:25 PM

Advertising
Advertising