ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 World Cup: ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్.. అది ఒరిజినల్ ట్రోఫీ కాదు.. పూర్తిగా ఫేక్!

ABN, Publish Date - Jul 04 , 2024 | 08:16 PM

చాలాకాలం నిరీక్షణకు చెక్ పెడుతూ టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో.. భారత ఆటగాళ్లు ట్రోఫీ పట్టుకొని తిరుగుతున్నారు. ఈ మధురానుభూతిని జీవితాంతం గుర్తు పెట్టుకోవడం..

Fake World Cup Trophy

చాలాకాలం నిరీక్షణకు చెక్ పెడుతూ టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) గెలవడంతో.. భారత ఆటగాళ్లు ట్రోఫీ (World Cup Trophy) పట్టుకొని తిరుగుతున్నారు. ఈ మధురానుభూతిని జీవితాంతం గుర్తు పెట్టుకోవడం కోసం ట్రోఫీతో ఫోటోలు దిగడంతో పాటు వీడియోలు తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోనూ (PM Modi) ట్రోఫీ చేత పట్టుకొని ఫోటోలకు పోజులిచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఆ ట్రోఫీ పూర్తిగా ఫేక్ అనే విషయం మీకు తెలుసా? అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ప్రస్తుతం భారత ఆటగాళ్ల చేతిలో ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదు, దాని డూప్లికేట్.


మరి.. ఒరిజినల్ ట్రోఫీ సంగతేంటి? అని అనుకుంటున్నారా! దానిని కేవలం ఫోటోషూట్ కోసం మాత్రమే అందిస్తారు. ఒక జట్టు విజయం సాధించాక.. ప్రెజెంటేషన్ సమయంలో ఒరిజినల్ ట్రోఫీని ఇస్తారు. అనంతరం దాంతో ఫోటోషూట్స్ తీసుకోవచ్చు. అంతే.. ఆపై విజేతలకు అచ్చం దాన్ని పోలి ఉండే డూప్లికేట్ ట్రోఫీ ఇస్తారు. దానిపై ఇయర్, ఈవెంట్ లోగోను ముద్రించి.. విన్నర్స్‌కు అందజేస్తారు. ఇది చూడ్డానికి ఒరిజినల్ ట్రోఫీనే పోలి ఉంటుంది కానీ, అదొక డూప్లికేట్ కప్. అలాంటి డూప్లికేట్ ట్రోఫీనే మన టీమిండియా భారత్‌కు తీసుకొచ్చింది. ఒరిజినల్ ట్రోఫీ మాత్రం.. దుబాయ్‌లోని ఐసీసీ కార్యాలయంలోనే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆచారం.


కాగా.. భారత జట్టు చివరిసారిగా టీ20 వరల్డ్‌కప్‌ను 2007లో గెలిచింది. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత రెండో ప్రపంచకప్ సాధించింది. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత కప్ గెలవడంతో.. భారత ఆటగాళ్లకు ముంబైలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముంబై మెరైన్ డ్రైవ్ బీచ్ దగ్గర నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్ షో నిర్వహించి.. ఆపై స్టేడియంలో ఆటగాళ్లను సన్మానించారు. అంతకుముందు.. గురువారం ప్రత్యేక ఫ్లైట్‌లో బార్బడోస్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్లేయర్స్‌కి అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు వద్ద ఫ్యాన్స్ పోటెత్తి, ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి.. అల్పాహారం సేవించడంతో పాటు కాసేపు ఆయనతో ముచ్చటించారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 04 , 2024 | 08:16 PM

Advertising
Advertising