ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా.. కోహ్లీతో ఏం మాట్లాడారు..

ABN, Publish Date - Nov 28 , 2024 | 02:13 PM

అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా ప్రధాని టీమిండియాలో జోష్ నింపారు. భారత జట్టును కలుసుకున్న ప్రధాని వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు..

Team India

క్యాన్‌బెర్రా: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు కాన్‌బెర్రా చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పార్లిమెంట్ హౌస్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ను కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా ప్రధానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఆటగాళ్లను పరిచయం చేస్తూ కనిపించాడు. బుమ్రా, విరాట్ కోహ్లీ, అశ్విన్, పంత్‌తో ప్రధాని ఆంథోని ముచ్చటిస్తూ కనిపించారు. కోహ్లీని ప్రత్యేకంగా పలకరించిన ప్రధాని అతడిచ్చిన సమాధానానికి నవ్వుకుంటూ ముందుకు కదిలారు. భారత ఆటగాళ్లతో కాసేపు సరదాగా గడిపిన ఆయన మ్యాచ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే డిసెంబరు 6 నుంచి అడిలైడ్ ఓవల్‌లో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా నవంబర్ 30 నుంచి క్యాన్‌బెర్రాలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.


పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌లో తమ ప్రదర్శన తర్వాత రోహిత్ శర్మ అండ్ కో ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని టీమ్‌ ఇండియా ఎదురుచూస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ పునరాగమనం తర్వాత టీమ్ ఇండియా సరికొత్త జోష్ తో కనిపించింది. అయితే, భారత జాతీయ క్రికెట్ జట్టుకు డే-నైట్ టెస్టు అంత తేలికైన పని కాదు.


అడిలైడ్‌లో డే-నైట్ టెస్టు ఆడిన టీమిండియా 36 పరుగులకే ఆలౌటైంది, చివరికి ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత జట్టు ఇప్పటి వరకు మూడు డే అండ్ నైట్ టెస్టులు ఆడింది, అందులో వారు స్వదేశంలో రెండు విజయాలు సాధించగా, ఆస్ట్రేలియాపై ఓటమిని చవిచూశారు. గత ఓటమి నుంచి బయటపడి మ్యాచ్‌లో విజయం సాధించాలని భారత జట్టు ఎదురుచూస్తోంది.

Mohammad Shami: షమీకి బీసీసీఐ డెడ్‌లైన్.. ఆ రెండు కఠిన పరీక్షలు దాటితేనే..


Updated Date - Nov 28 , 2024 | 02:14 PM