IND vs NZ: టీమ్ఇండియా ఆలౌట్.. కివీస్ లక్ష్యం 107
ABN, Publish Date - Oct 19 , 2024 | 05:32 PM
కొత్త బాల్ అందుకోగానే న్యూజిలాండ్ ఆటగాళ్లు విశ్వరూపం చూపించారు. దీంతో భారత్ వేగంగా వికెట్లను కోల్పోవలసి వచ్చింది. 62 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 46 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 402 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
బెంగళూరు: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 462 వద్ద ఆలౌట్ అయ్యింది. ఇప్పుడు కివీస్ ముందు 107 పరుగుల లక్ష్యాన్ని నెలకొల్పింది. సర్ఫరాజ్ ఖాన్ 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్ లతో భారీ సెంచరీని నమోదు చేశాడు. రిషభ్ పంత్ సైతం గాయం నుంచి కోలుకుని 105 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగాడు. అయితే, పంత్ రెప్పపాటు క్షణంలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 400/3తో గట్టి పోటీనిచ్చిన టీమిండియా కివీస్ బౌలర్ల దాటికి ఒక్క సారిగా కుప్పకూలింది.
కొత్త బాల్ అందుకోగానే న్యూజిలాండ్ ఆటగాళ్లు విశ్వరూపం చూపించారు. దీంతో భారత్ వేగంగా వికెట్లను కోల్పోవలసి వచ్చింది. 62 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 46 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 402 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తరపున విలియం ఒరూర్క్, మాట్ హెన్రీ చెరో మూడు వికెట్లు తీయగా, అజాజ్ పటేల్ రెండు, టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు. భారత ప్లేయర్లు విరాట్ కోహ్లీ (70), రోహిత్ (52), జైశ్వాల్ (32) పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ (12), రవీంద్ర జడేజా (5), అశ్విన్ (15)తో సరిపెట్టారు.
అయితే, వెలుతురు తక్కువ ఉన్న కారణంగా మరోసారి మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. నాలుగో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ ఆధిక్యాన్ని తగ్గించేంచేందుకు బరిలోకి దిగిన భారత్ కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినప్పటికీ తక్కువ స్కోరుతోనే వెనుదిరిగింది.
IND vs NZ: హాఫ్ సెంచరీలతో పంత్ అరుదైన రికార్డు..
Updated Date - Oct 19 , 2024 | 05:32 PM