Team India Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా అతడే కన్ఫమ్.. ఇదిగో సాక్ష్యం!
ABN, Publish Date - Jul 07 , 2024 | 04:29 PM
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే ప్రశ్నకు ఇంతవరకు క్లారిటీ రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అనే వార్తలు వచ్చాయి. ఈ రేసులో...
రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే ప్రశ్నకు ఇంతవరకు క్లారిటీ రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) దాదాపు కన్ఫమ్ అనే వార్తలు వచ్చాయి. ఈ రేసులో డబ్ల్యూవీ రమన్ కూడా ఉన్నారు కానీ, గంభీరే బీసీసీఐ హాట్ ఫేవరేట్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ.. బీసీసీఐ (BCCI) నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో.. కేకేఆర్ కాంపౌండ్ నుంచి ఒక లీక్ బయటకు వచ్చింది. గంభీరే భారత జట్టు హెడ్ కోచ్ అనే సంకేతాలు ఇచ్చింది.
ఓ నివేదిక ప్రకారం.. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్‌లో ఓ ఫేర్‌వెల్ షూట్ జరిగిందని, దీనిని గౌతమ్ గంభీర్ హాజరయ్యారని ‘క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్’ (CAB) అధికారి ఒకరు ధృవీకరించారు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా నిర్వహించడం జరిగిందని, తన అభిమానులకు ఒక సందేశంతో వీడ్కోలు పలకాలని గంభీర్ భావించాడని, అందుకే ఈ వీడియోని చిత్రీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. కాగా.. ఈ వీడియోని గంభీర్ వ్యక్తిగత టీమ్ చిత్రీకరించిందని, కేకేఆర్ ఫ్రాంచైజీ కాదని తేలింది. కేకేఆర్‌తో గంభీర్ ప్రయాణం ఎలా సాగిందనేది ఈ వీడియోలో చూపించబోతున్నారని తెలుస్తోంది. హెడ్ కోచ్‌గా గంభీర్ నియమించబడ్డాక.. ఈ వీడియోని విడుదల చేస్తారని సమాచారం.
ఇదిలావుండగా.. టీ20 వరల్డ్‌కప్ టోర్నీతో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. దీంతో.. తదుపరి కోచ్ ఎవరనే ప్రశ్న సంధించగా.. బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక టూర్‌కు కొత్త కోచ్ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. కానీ.. ఎవరనే విషయాన్ని రివీల్ చేయలేదు. కాగా.. శ్రీలంక టూర్‌లో భాగంగా టీమిండియా ఆ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడబోతోంది. ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్న భారత యువ ఆటగాళ్ల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 07 , 2024 | 04:29 PM