IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20: ఆ ఇద్దరి జోడీకి టీమిండియా రికార్డులు బద్దలు
ABN, Publish Date - Nov 16 , 2024 | 02:54 PM
నాలుగు సిరీస్ ల టీ20ల్లో చివరి రెండు మ్యాచుల్లో సెంచరీ బాదిన తిలక్ వర్మ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
జొహెన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన చివరి టీ20లో టీమిండియా క్రికెటర్లు సంజూ శాంసన్, తిలక్ వర్మ జోడీకి రికార్డులు బద్దలయ్యాయి. వీరిద్దరి భాగస్వామ్యంతో 135 పరుగుల తేడాతో టీమిండియా సఫారీలను చిత్తు చేసింది. వీరిద్దరూ కలిసి మైదానంలో చెలరేగిన తీరుకు పలు టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఇక ఈ నాలుగు సిరీస్ ల టీ20ల్లో చివరి రెండు మ్యాచుల్లో సెంచరీ బాదిన తిలక్ వర్మ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అయిదో స్థానంలో నిలిచాడు. గుస్తావ్ మెకియాన్, రిలే రోసోవ్, ఫిలిప్ సాల్ట్, సంజు శాంసన్ వంటి క్రికెటర్లు తిలక్ కన్నా ముందు ఈ ఘనత సాధించిన వారి జాబితాలో ఉన్నారు. కాగా, శాంసన్‌తో 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేసి తిలక్ ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అలాగే సౌతాఫ్రికాపై ఏ వికెట్‌కు అయినా ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. అంతర్జాతీయ టీ20ల్లో రెండో వికెట్ లేదా అంతకంటే తక్కువ వికెట్లకు కూడా ఈ స్థాయి స్కోరు చేయడం సరికొత్త రికార్డు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం టీమిండియాకు కలిసొచ్చింది. దీంతో ఓపెనర్లిద్దరూ టీమ్ ఇండియాకు శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను చిత్తుచేశారు. 18 బంతుల్లో 36 పరుగులు చేసి అభిషేక్ అవుటయ్యే సమయానికి టీమిండియా 5.5 ఓవర్లలో 73 పరుగులు స్కోర్ చేసింది. ఇక్కడి నుంచి తిలక్ వర్మతో కలిసి శాంసన్ బీభత్సం సృష్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 బంతుల్లో 210 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సంజు 56 బంతుల్లో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, తిలక్ 47 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Rohit Sharma: రోహిత్ శర్మ ఇంట్లోకి 'జూనియర్ హిట్‌మ్యాన్' ఆగయా.. అభిమానుల విషెస్..
Updated Date - Nov 16 , 2024 | 02:57 PM